Type to search

భాషా కోవిదుడికి జగన్ బహుమానం ..!

Latest News News Politics

భాషా కోవిదుడికి జగన్ బహుమానం ..!

Yarlagadda Lakshmi Prasad, Yarlagadda Lakshmi Prasad news, Yarlagadda Lakshmi Prasad latest news, politician Yarlagadda Lakshmi Prasad, chairman of AP Adhikara Bhasha Sangam, Yarlagadda Lakshmi Prasad as chairman of AP Adhikara Bhasha Sangam, Yarlagadda Lakshmi Prasad appointed as chairman of AP Adhikara Bhasha Sangam, AP Adhikara Bhasha Sangam , Yarlagadda Lakshmi Prasad Official language commission chairman, Yarlagadda Lakshmi Prasad as Official language commission chairman , Yarlagadda Lakshmi Prasad chairman of Official language commissionతెలుగు బాషా అంటేనే మొదటగా గుర్తుకు వచ్చే పేరు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఆయన ఏది మాట్లాడినా అది వినసొంపుగా ఉంటుంది. సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదుడిగా, సకల కళా వల్లభుడిగా, రాజస్య భాషకు ప్రేమికుడిగా..కళా పిపాసిగా, చేయి తిరిగిన రచయితగా ఆయనకు పేరుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి సరైన సమయంలో అరుదైన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా అపారమైన అనుభవం కలిగిన యార్లగడ్డకు అరుదైన కానుకను అందించారు. ఏకంగా ఏపీ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నియమించారు. దీంతో తెలుగు భాష పట్ల సీఎం కు ఉన్న అభిమాననాన్ని చాటుకున్నారు. ఆయన మాట్లాడితే ఇంకా వినాలని అనిపిస్తుంది . విషయాన్నీ పూస గుచ్చినట్లు చెప్పడం ఆయనకు మాత్రమే చెల్లింది.

సభను నడిపించాలన్నా, సక్సెస్ చేయాలన్నా యార్లగడ్డ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎందరో. ఆయన నిత్యా పాఠకుడు. మంచి వక్త. అంతకు మించి ప్రయోక్త ..రచయిత. కవి ..అనువాదకుడు ..రాజకీయ నాయకుడు ..ఇంకా చెప్పాలంటే తెలుగు సంస్కృతి , సాంప్రదాయం , నాగరికత అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఈ అరుదైన పదవి దక్కడం వల్ల రాబోయే రోజుల్లో మాతృ భాషకు మంచి రోజులు వస్తాయని భాషా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక యార్లగడ్డ విషయానికి వస్తే, ఆయన కృష్ణా జిల్లా వానపాముల లో పుట్టారు . నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగంలో ఆచార్య పదవి పొందారు. హిందీ భాష, సాహిత్యం లో విశేషంగా కృషి చేస్తూ వస్తున్నారు.

లెక్కలేనన్ని తెలుగు పుస్తకాలను హిందీలోకి అనువాదం చేశారు . ఇప్పటికీ 64 కి పైగా పుస్తకాలు రాశారు. రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలు అందించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితీ రాయబారిగా అమెరికా , మలేషియా, కెనడా, థాయ్ లాండ్, సింగ పూర్ , ఇంగ్లాండ్, ప్రాన్స్, రష్యా వంటి అనేక దేశాలు పర్యటించారు. ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ‘ద్రౌపది’ తెలుగు నవలకు గాను ఈ పురస్కారం వరించింది. ‘తమస్‌’ అనే హిందీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు అవార్డును అందుకున్నారు. మొత్తం మీద ఏపీ సర్కార్ ఈ రూపంలో యార్లగడ్డకు అరుదైన పదవి ఇవ్వడం తనకు తాను గౌరవవించు కోవడమే .

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *