Type to search

మ‌హిళ‌లు అసాధార‌ణ విజ‌యాలు స్ఫూర్తికి సంకేతాలు

News Sports Top Stories Women

మ‌హిళ‌లు అసాధార‌ణ విజ‌యాలు స్ఫూర్తికి సంకేతాలు

hima das 5th gold, hima das gold medal 2019, hima das, sachin tendulkar, hima das athlete, hima das olympic athlete, raatnam, chandrayaan 2.0, chandrayaan launch live, isro live, sriharikota, chandrayaan 2, chandrayaan 2 live, chandrayaan 2 launch video, chandrayaan 2 live streaming, chandrayaan 2 countdown, isro live chandrayaan 2, isro live stream, isro live channel, raatnam, chandrayaan 2.0 bahubali, gslv mark 3, women in all fields, women empowerment, womenఆకాశంలో స‌గమే కాదు అభివృద్ధిలో ..అన్ని రంగాల్లో మ‌హిళ‌లు లేకుండా విజ‌యాలు సాధించ‌డం క‌ష్టం. ఇటీవ‌ల మ‌హిళ‌లు రాజ‌కీయ‌, క్రీడా, ఆర్థిక‌, వ్యాపార‌, శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో పాలుపంచుకంటూ త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్ర వివ‌క్ష‌కు లోనైన మ‌హిళలు ఇపుడు మారుతున్న ప్ర‌పంచంలో త‌మ వాయిస్ ను బ‌లంగా వినిపిస్తున్నారు. తాజాగా 19 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన హిమ‌దాస్ అద్భుత‌మైన గెలుపును సాధించింది. అసాధార‌ణ‌మైన విజ‌యాల‌ను న‌మోదు చేసింది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేసే దాకా ఆమె సాధించిన స‌క్సెస్ గురించి ఈ దేశ వాసులకు తెలియ‌లేదు. అయిన దానికి కాని దానికి చిన్న విష‌యాన్ని పెద్ద‌దిగా చేసి 24 గంట‌లు ప్ర‌సారం చేసే జాతీయ మీడియా హిమ‌దాస్ గురించి అస్స‌లు ప‌ట్టించు కోలేదు.

ఇక నేష‌న‌ల్, స్టేట్ ప్రింట్ మీడియా కూడా కావాల్సినంత స్పేస్ ఇవ్వ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హిమ‌దాస్ గురించి భారీ ఎత్తున నెటిజ‌న్లు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆమె సాధించిన విజ‌యానికి జేజేలు ప‌లికారు. త‌ర్వాత ప్రింట్, మీడియాలు ఆమె గురించి రాశాయి. గోల్డెన్ గ‌ర్ల్‌గా ఇపుడు కీర్తిస్తున్నారు. మేరీ కోమ్ కు పెళ్ల‌యినా..ఛీత్కారానికి గురైనా..ఎన్నో అవ‌మానాల‌ను భ‌రించింది. బాక్సింగ్‌లో గెలుపొంది రికార్డుల మోత మోగించింది. ఒలంపిక్స్ లో పీవీ సింధు బ్యాడ్మింట‌న్ లో గెలుపొందింది. ఇక మిథాలీరాజ్ క్రికెట్ ఆట‌కే వ‌న్నె తెచ్చింది. ప‌రుగుల వ‌ర‌ద పారించింది. 2017లో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆమె త‌న ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించింది.

ఈ హైద‌రాబాదీ క్రికెట‌ర్ కు ఉన్నంత క్రేజ్ ఇంకెవ్వ‌రికీ లేదు. ప్ర‌తి మ‌హిళ విజ‌యం వెనుక ఎవ‌రో ఒక‌రు ఉంటారు. ఇక చంద్ర‌యాన్ -2 లాంఛింగ్ లో ఇద్ద‌రు మ‌హిళా సైంటిస్టులు పాలు పంచుకున్నారు. వారిలో రితు క‌రిధాల్ మిష‌న్ డైరెక్ట‌ర్ కాగా , ఎం. వ‌నిత ప్రాజెక్టు డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నారు. ఈ స‌క్సెస్‌లో వీరి పాత్ర‌ను విస్మ‌రించ‌లేం. మ‌రో వైపు రాజ‌కీయంగా చూస్తే స్మృతీ ఇరానీ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ఎదిగారు. ఏకంగా మోదీ కేబినెట్‌లో మంత్రిగా చేరారు. 2019లో కొలువు తీరిన కేబినెట్‌లో నిర్మ‌లా సీతారామ‌న్ ఆర్థిక శాఖ మంత్రిగా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. సినిమా రంగంతో పాటు సాహిత్య రంగంలో కూడా మ‌హిళ‌లు రాణిస్తున్నారు. త‌మ క్రియేటివిటీతో ఆక‌ట్టుకుంటున్నారు. ఇక ఐటీ రంగంలో మ‌హిళ‌ల‌దే హ‌వా. టీం లీడ‌ర్లుగా, సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లుగా త‌మ‌ను తాము నిరూపించుకంటున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *