Type to search

ఇక చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ ఎంట‌ర్

Life Style News Stories Top Stories

ఇక చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ ఎంట‌ర్

whatsapp, whatsapp money, whatsapp into transactions, whatsapp into banking, whatsapp banking, whatsapp transactions, whatsapp e money, whatsapp money, raatnamడిజిట‌లైజేష‌న్ పుణ్య‌మా అంటూ ఇండియాలో ఆన్ లైన్‌లో పేమెంట్స్ కు సంబంధించిన లావాదేవీలకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. ప్ర‌భుత్వ , ప్రైవేట్ బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌లు అందించ‌డంలో పోటీ ప‌డినా చివ‌ర‌కు అవి కూడా అస‌లైన టైంలో చేతులెత్తేశాయి. ఎప్పుడైతో కేంద్రంలో బీజేపీ స‌ర్కార్ కొలువు తీరిందో అప్ప‌టి నుంచి జ‌నానికి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. అన్నింటికి మించి ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్ష‌న్స్ పెరుగ‌గా , ఇంకా స‌గానికి పైగా సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నారు. ఏ ఒక్క లావాదేవీ జ‌రిపినా లేదా నిర్వ‌హించినా ..చెల్లింపులు జ‌రిపినందుకు అడ్డ‌గోలుగా క‌మీష‌న్ వ‌సూలు చేస్తున్నారు. ఈ దందా మ‌రింత ఎక్కువ‌గా జ‌రుగుతోంది ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌లో. ఆయా బ్యాంకుల‌కు సంబంధించిన ఎనీ టైం మిష‌న్ అంటే ఏటీఎంలు నో క్యాష్ అన్న బోర్డులు త‌గిలించి ..ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఏదైనా అవ‌స‌రం ఉందంటే క‌మీష‌న్ దారుల వ‌ద్ద‌కు ప‌రుగులు తీయాల్సి వ‌స్తోంది. ఇంత జ‌రుగుతున్నా ఆర్బీఐ కానీ లీడ్ బ్యాంకు కానీ, జిల్లా స్థాయిలలో ఉన్న ఉన్న‌తాధికారులు కానీ ఎవ‌రూ స్పందించ‌డం లేదు.

చెల్లింపులు అనేవి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా జ‌రుగుతుండ‌డంతో మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ అనేదీ చాలా సుల‌భ‌త‌రంగా మారింది. దీంతో క‌మీష‌న్ పోయినా ప‌ర్వాలేదు..డ‌బ్బులు అయితే త‌మ ఖాతాల్లోకి వ‌స్తున్నాయ‌నుకుని క‌స్ట‌మ‌ర్లు అలాగే భ‌రిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో బ్యాంక‌ర్లు ..క‌మీష‌న్‌దారుల మ‌ధ్య లోపాయికారీగా ఒప్పందం చేసుకోవ‌డం..వ‌చ్చిన క‌మీష‌న్ల‌లో కొంత బ్యాంకు అధికారుల‌కు ఇవ్వ‌డంతో ఈ దందా జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే డిజిట‌ల్ పేమెంట్స్ రంగంలో ఎన్నో సంస్థ‌లు, బ్యాంకులు, దిగ్గ‌జ కంపెనీలు ప‌నిచేస్తున్నాయి. ఎయిర్‌టెల్ , మ‌హీంద్రా టెక్, బ‌జాజ్ ఫైనాన్స్తో పాటు పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందుబాటులోకి వ‌చ్చాయి. ఏది భ‌ద్రం అనే దానిపైనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో దిగ్గ‌జ కంపెనీగా పేరొందిన వాట్సాప్ కూడా చెల్లింపుల రంగంలోకి దిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన సామాజిక మాధ్య‌మాల‌న్నీ ఇండియాపై దృష్టి పెట్టాయి. ఇక్క‌డ కోట్లాది మంది స్మార్ట్ ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. దీంతో ప్ర‌తిదీ ఇందులోనే ల‌భ్య‌మవుతోంది. రిల‌య‌న్స్ జియో వ‌చ్చాక ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉండ‌డం, డేటా అధికంగా వినియోగంలోకి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఇందులోనే గ‌డుపుతున్నారు.

ప్ర‌తి రోజు, ప్ర‌తి నెలా నిత్యావ‌స‌రాల‌కు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి వ‌స్తుంది. ఆఫీసుల‌కు వెళ్లి చెల్లించే కంటే..ఆన్‌లైన్‌లోనే చెల్లించే అవ‌కాశం ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు దీనినే ఉప‌యోగిస్తున్నారు. ఇండియాలో ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్‌కు ఎక్కువ కావ‌డంతో వాట్సాప్ ఇందులోకి రావాల‌ని అనుకుంటోంది. ఈ ఏడాది ఎండింగ్ లోపు పేమెంట్స్, స‌ర్వీసులు అందుబాటులోకి వ‌చ్చేలా చేస్తామంటోంది వాట్సాప్ ఇండియా వింగ్ యాజ‌మాన్యం. ఈ సేవ‌లు వినియోగదారుల‌కు అంద‌జేయాలంటే ముందు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప‌ర్మిష‌న్ ఆర్బీఐ ఇవ్వ‌క పోవ‌డంతో సేవ‌లు స్టార్ట్ చేయ‌లేదు వాట్సాప్. ఢిల్లీలో జ‌రిగిన అవార్డుల కార్య‌క్ర‌మానికి స‌ద‌రు కంపెనీ హెడ్ క్యాత్ కార్డ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వాట్సాప్ ద్వారా ఎంత సుల‌భంగా మెస్సేజ్‌లు పంపించవ‌చ్చో..డ‌బ్బులు కూడా అంతకంటే త్వ‌ర‌గా పంపించు కోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. భార‌త ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కే తాము సేవ‌లు అంద‌జేస్తామ‌ని ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ఆర్బీఐకి వెల్ల‌డించామ‌ని తెలిపారు. మొత్తం మీద ప్ర‌పంచాన్ని శాసిస్తున్న వాట్సాప్ ఇపుడు పేమెంట్స్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవ‌చ్చు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *