Type to search

భళారే..అయ్యారే..అయ్యర్..కోహ్లీ కితాబు..!

News Sports Top Stories

భళారే..అయ్యారే..అయ్యర్..కోహ్లీ కితాబు..!

Virat, Kohli, Virat Kohli, captain Virat Kohli, Virat Kohli indian player, cricket, india, captain, indian team Virat Kohli, Virat Kohli in indian team, Virat Kohli story, Virat Kohli victory, Virat Kohli hero, article on Virat Kohliకష్టాల్లో ఉన్నప్పుడు గోడలా నిల్చున్న వాడే నిజమైన హీరో. యుద్ధం లో కానీ, ఏ ఆటలో కానీ విజయ తీరాలకు తీసుకు వెళ్లే వారినే అభిమానులు ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటారు. అలాంటి వారిలో టీమిండియాలో మహమ్మద్ అజారుద్దీన్ , రాహుల్ ద్రవిడ్ లాంటి ఆటగాళ్లు ఎందరో తమ ప్రతిభా పాటవాలతో గట్టెక్కించారు. మరిచి పోలేని విజయాలు అందించారు. భారత జట్టు ప్రపంచ కప్ హాట్ ఫెవరెట్ గా ఉన్నా సెమీ ఫైనల్ లో ఒడి పోయింది . దీంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కోహ్లీ సారధ్య బాధ్యతలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆటగాడిగా రాణించినా జట్టుకు విజయాలు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.

ఈ సమయంలో పలువురు సీనియర్లు సైతం అతడిని తప్పు పట్టారు. ధోని క్రీజ్ లో ఉన్నప్పటికీ సరిగ్గా ఆడలేదంటూ ఫ్యాన్స్ మంది పడ్డారు. ఈ సమయంలో బీసీసీఐ ఎంపిక కమిటీ తీరుపై దేశమంతటా ఆగ్రహం వ్యక్తమైంది . జట్టు ఎంపికలో పారదర్శకత పాటించ లేదని , జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆటను ప్రదర్శించ లేదని మంది పడ్డారు . జట్టు ఆడే సమయంలో నాలుగో ప్లేస్ అతి ముఖ్యమైనది. ఓపెనర్లు ఫెయిల్ అవుతే జట్టును ఆదు కోవడంతో పాటు ముందుండి నడిపించే భాద్యత ఈ స్థానంలో మైదానంలోకి వచ్చే ప్లేయర్ పై ఉంటుంది. గత కొంత కాలంగా టీమిండియా నాలుగో స్థానంలో కుదురుకుని ..పరుగులు సాధించే బ్యాట్స్ మెన్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.

అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో టీమిండియా గత కొన్నేళ్లుగా ఈ ప్లేస్ ను భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషిస్తోంది . తాజాగా బీసీసీఐ శ్రేయాస్ అయ్యర్ ను మరోసారి జట్టు కోసం ..విండీస్ టూర్ కోసం ఎంపిక చేసింది . అక్కడి పర్యటనలో అయ్యర్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. కోహ్లీకి వెన్ను దన్నుగా నిలిచాడు. దీంతో భారత జట్టు వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ ఈ క్రికెటర్ పై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల మాజీ సారధి గవాస్కర్ సైతం విమర్శలు చేశాడు . కోహ్లీ , కోచ్ లు మాత్రం శ్రేయస్ పైనే నమ్మకం ఉంచారు . దీంతో వారి నమ్మకాన్ని నిలబెట్టాడు అయ్యర్. పూర్తి ఫామ్ మీదున్న ఈ ఆటగాడు మరికొన్ని మ్యాచ్ లు ఆడితే కానీ తన స్టామినా ఏమిటో తెలుస్తుంది. అయితే జట్టు సారథి కోహ్లీ మాత్రం శ్రేయస్ అయ్యర్ గేమ్ చేంజర్ అంటూ కితాబు ఇవ్వడం విశేషం.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *