Type to search

నేడు నాసా ఉపగ్రహంతో ‘విక్రమ్‌’ చిత్రీకరణ

News

నేడు నాసా ఉపగ్రహంతో ‘విక్రమ్‌’ చిత్రీకరణ

Chandrayaan 2, Vikram Lander, Lunar Surface, ISRO, vikram lander chandrayaan 2 live, chandrayaan vikram lander, chandrayaan 2 live streaming, chandrayaan 2 live streaming nasa, chandrayaan 2 live landing, k sivan isro chandrayaan 2, isro chairman k sivan, vikram lander test, chandrayaan 2 landing on moon, raatnam, vikram lander spotted on moon, Vikram lander, Vikram lander nasa photographs, nasaదిల్లీ: చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా ఉన్న విక్రమ్ ల్యాండర్ ను ఫొటో తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా మంగళవారం ప్రయత్నించనుంది. ఆ చిత్రాలను భారత్ కు అందజేస్తుంది. ఫలితంగా ల్యాండర్ తాజా స్థితిగతులపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగేందుకు ప్రయత్నించిన చంద్రయాన్ -2 వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్ కు చివరి నిమిషంలో భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. అది చంద్రుడి ఉపరితలంపై మృదువుగా కాకుండా గట్టిగా ఢీకొన్నట్లు దిగిందని (హార్డ్ ల్యాండింగ్ ) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. విక్రమ్ తో కమ్యూనికేషన్లు ఏర్పరచుకునేందుకు నాసాతో కలసి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతంపైకి నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ ఆర్ వో) మంగళవారం వస్తుంది. ఈ ఉపగ్రహం చంద్రుడి ఉపరితలానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *