Type to search

రాములమ్మ సొంత గూటికి చేరేనా ?

Latest News News Politics

రాములమ్మ సొంత గూటికి చేరేనా ?

vijaya shanthi, politician vijaya shanthi, vijaya shanthi in bjp, vijaya shanthi in congress, vijaya shanthi to bjp, vijaya shanthi bjp, bjp, trs, congress, andhra pradesh, politics, telangana, bjp in telangana, bjp strategyతెలంగాణలో బలపడడం ద్వారా 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోన్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి ఇప్పటికే పలువురు ఇతర పార్టీ నేతలను తమ పార్టీ లో చేర్చుకుంది . గతం లో బీజేపీ లో పని చేసి ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకులను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలను కూడా ఆ పార్టీ నాయకత్వం చేస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ని పార్టీ లో చేర్చుకోవడం లో సక్సెస్ అయిన బీజేపీ నాయకత్వం, ఇక ప్రస్తుతం రాములమ్మ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది .
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా..ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఉన్నా..జనాకర్షణ నేత లేకపోవటంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామనే భావనలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి .
ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక పదవి లో కొనసాగుతున్న విజయశాంతి, అయినా పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది . ముఖ్యమంత్రి కేసీఆర్ పై , రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్న విజయశాంతి , పార్టీ అధిష్టానం అనుమతి లేకపోవడం తో ప్రత్యక్ష కార్యాచరణకు దిగలేకపోతుందని , అందుకే ట్విట్టర్లు..ఫేస్‌బుక్ పోస్టింగ్‌లకే పరిమితమవుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
కాంగ్రెస్ అధిష్టాన తీరు పట్ల విజయశాంతి అసంతృప్తి తో ఉన్న విషయాన్నీ తెలుసుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , తన దూతలు ను రంగం లోకి దించి ఆమెతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది . బీజేపీతో జాతీయ నాయకులతో సత్ సంబంధాలు కలిగిన విజయశాంతి తిరిగి కాషాయ కండువా కప్పుకుంటారా? లేదా ?? అన్నది సర్వత్రా హాట్ టాఫిక్ గా మారింది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *