Type to search

వెంకటేష్ పుట్టిన రోజు కానుక గా వెంకీమామ !

Box Office News

వెంకటేష్ పుట్టిన రోజు కానుక గా వెంకీమామ !

Venky Mama, Venky Mama first look, Venky Mama teaser, Venky Mama trailer, Venky Mama making, Venky Mama telugu movie, venkatesh naga chaitanya movie, suresh productions, payal rajput, raashi khanna, thaman s, thaman movies, venkatesh movies, naga chaitanya movies, venky mama songs, Venky Mama Pre Teaser, venky mama movie teaser, venky mama new teaser, venky mama first look teaser, venky mama dussehra teaser, venky mama first glimpse, venky mama latest teaser, venky mama release date, venky mama release in Decemberనిజ జీవితం లో మేనమామ-మేనల్లుడు వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న చిత్రం వెంకీ మామ. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించాడు. కాగా ఈ మూవీ విడుదల విషయంలో ఎప్పటినుంచో డైలమా నడుస్తూ వస్తోంది.

మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే అప్పటికే మహేష్, బన్నీల మధ్య కాంపిటేషన్ ఫుల్‌గా ఉండటంతో క్రిస్మస్‌ బరిలో వెంకీమామను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. కానీ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోగా.. వెంకీమామ విడుదల తేదీ డ్రామాను తెరదించేందుకు రానా రంగంలోకి దిగాడు. ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీని ఇచ్చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన నిర్మాతలు.. డిసెంబర్ 13న వెంకీమామ రిలీజ్ అని చెప్పేశారు. అదే రోజు వెంకటేష్ పుట్టినరోజు , అదే రోజు ఈ సినిమా వస్తుంది .

అయితే నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమా లో అతిథి పాత్రలో కనిపించాడు వెంకటేష్. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో ఫుల్ సినిమా వస్తుండడం తో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా లో వెంకటేష్ రైతుగా కనిపించనుండగా.. చైతూ జవాన్‌గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల రావడం తో పాటు.. ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహిస్తురట.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *