Type to search

మరాఠా రాజ్యంలో శివసేనాని పట్టాభిషేకం

News Politics Trenging News

మరాఠా రాజ్యంలో శివసేనాని పట్టాభిషేకం

Maharashtra, Maharashtra politics, Maharashtra elections, Maharashtra cm, Maharashtra chief minister, Uddhav Thackeray, Uddhav Thackeray cm of Maharashtra, Uddhav Thackeray shiv sena, shiv sena party, Uddhav Thackeray oath swearingముంబయి: మరాఠా రాజ్యంలో శివసేనాని పట్టాభిషేకం వైభవంగా జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ వేదికగా ఉద్దవ్‌తో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారి ప్రమాణం చేయించారు.

ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఎంపీ సుప్రియా సూలె, అజిత్‌ పవార్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, టీఆర్‌ బాలు, ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, మల్లికార్జున ఖర్గే, కపిల్‌ సిబల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, పలువురు నేతలు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు మహారాష్ట్ర తొలి కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *