Type to search

బడ్జెట్ ప్రసంగం ద్వారా రాష్ట్ర అభివృద్ధి పై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి

Latest News News Politics

బడ్జెట్ ప్రసంగం ద్వారా రాష్ట్ర అభివృద్ధి పై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి

telangana assembly, telangana assembly live, telangana assembly budget session 2019, telangana budget 2019, cm kcr live, ts assembly live, ts budget 2019, telangana budget live, harish rao, ktr, harish rao speech in assembly 2019, harish rao assembly speech, telangana assembly 2019, tamilisai soundararajan, assembly telangana, kcr, telangana speaker, telangana assembly budget, telugu news live, telangana live, revanth reddy, telangana assembly videosబడ్జెట్ ప్రసంగం ద్వారా రాష్ట్ర అభివృద్ధి పై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి
చీఫ్ మినిస్టర్ చాలా చీప్ గా మాట్లాడాడు.

వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 1.82 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఇప్పుడు 1.46 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లే. వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే 36,000 కోట్ల మేరకు బడ్జెట్ ను కుదించడమంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతుంది.

దుబారా, అవినీతి, క్రమశిక్షణారాహిత్యం వల్ల రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని ఈ స్థితి ఎందుకు వచ్చిందో చెప్పండి.
నెలకు 11 వేల కోట్లు ఖర్చుబెట్టే స్థాయికి చేరామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే, రాబోయే 6 నెలలకు 66,000 కోట్లు ఖర్చుపెడుతారు. దీనిలో 35,000 కోట్లుయ్ బకాయిలకు, 15,000 కోట్లు జీతాలు, 6,000 కోట్లు పెన్షన్లు, 6,000 వడ్డీలు…. ఈ 66,000 కోట్లు వీటికే పోతే మరి అభివృద్ధి సంక్షేమ పథకాల సంగతి ఎం కావాలి?

మీరు పెట్టినటువంటి బడ్జెట్ కేవలం జీతాలు, తెచ్చిన అప్పులకు వడ్డీలు, సబ్సిడ్డిలు, పాత బకాయిలకు సరిపోయే పరిస్థితి లేదు. ఇగ అభివృద్ధి అక్కడిది ?
అంటే అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మీకు చేతకాక తప్పుకోండి. మేము పరిపాలన అంటే ఏంటో చూపెడుతాం.

బడ్జెట్లో ఉపాధి కల్పన గురించి ప్రస్తావన లేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రణాళిక లేదు. నైపుణ్యాల అభివుద్ది గురించి ఆలోచనలు లేవు.
బడ్జెట్లో విద్య, వైద్య ఆరోగ్యాలకు ప్రధాన్యం లేదు.
ఇండ్లులేని పేదలకు ఐదులక్షల ఇచ్చేటువంటి పధకం గురించి ఒక్క మాట లేదు.

పీ ఆర్ సి ప్రస్తావన లేదు. సీపీఎస్ ప్రస్తావన లేదు. 61 సంవత్సరాలకు పెంచుతామన్న రిటైర్మెంట్ వయస్సు ప్రస్తావన లేదు. మరి ఇగ ఇది ఎం బడ్జెట్ అన్నట్లు?
ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి ఏ విధంగా సాధిస్తారో చెప్పడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలకు కేంద్రం మీద బురద చల్లడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు.

ఒక బడ్జెట్ ప్రసంగాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు, తన రాజకీయ విమర్శలకు అవకాశంగా తీసుకోవడం దురదృష్ట కరం.

ముఖ్యమంత్రి గారు జీతాలు ఇవ్వలేని తమ దుస్థితిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు దేశంలో ఆర్ధిక మాంద్యం ఉండనే సాకును చూపెడుతున్నాడు. 18 నెలల నుండి ఆర్ధిక మాంధ్యముందని ముఖ్యమంత్రి గారు చెపుతున్నారు. 18 నెలల నుండి ఆర్ధిక మాంధ్యముంటే 6 నెలల క్రితం 1.82 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా పెట్టారు?

కేంద్రం వృద్ధి కొంత వేగం తగ్గింది కానీ ఎక్కడా మాంద్యం లేదు. దేశ ఆర్ధిక పరిస్థితి గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. మన విదేశీ మారకం, ద్రవ్యోల్భలం, ద్రవ్య లోటు, ట్రేడ్ లోటు ఇవన్నీ ఎప్పుడూ లేనంత మెరుగ్గా ఉన్నాయి. ఒకటి రెండు సెక్టార్ లలో వృద్ధి తగ్గినంత మాత్రాన కెసిఆర్ దేశం సంక్షోభంలో ఉందని నిండుసభలో మాట్లాడడం దుర్మార్గం.
చీఫ్ మినిస్టర్ చాలా చీప్ గా మాట్లాడాడు.

4.5 లక్షల కోట్ల రాష్త్ర స్థూల ఉత్పత్తి 8.6 లక్షల కోట్లకు చేరిందని చంకలు గుద్దుకుంటున్న సీఎం మరి 60,000 కోట్ల అప్పులు 2.5 లక్షల కోట్లకు చేరిన విషయం కూడా చెబితే బాగుండేది.

ఈ ప్రభుత్వం ప్రవేశబెట్టిన బడ్జెట్ కు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి. ఇంకా మిగిలింది రెండు త్రైమాసికాలే. దన్తలో కూడా చివరి త్రైమాసికంలో వచ్చే ఏడాదికి కావాల్సిన ప్రణాలికను తయారు చేసుకుంటారు. కాబట్టి ఒక త్రైమాసికం కోసం పెట్టె బడ్జెట్ కి పెద్ద ప్రాధాన్యం ఏముంటుంది?

తెలంగాణ ప్రభుత్వం పెట్టె బడ్జెట్ కు పెద్దగా విలువ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పెట్టె బడ్జెట్ లో 70 శాతం కూడా ఎప్పుడు ఖర్చు చేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పెట్టిన మొత్తాన్ని కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతికి 1810 కోట్లు కేటాయించారు. ఎవరికీ నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఇళ్ల కోసం పెట్టిన 2 వేల కోట్లలో ఎంత ఖర్చు చేశారు. బడ్జెట్లో పెట్టినదానికి, ఖర్చు చేసేదానికి అసలు పొంతన లేదు.

ఇది అన్ని రంగాల వారిని నిరాశపరిచింది.

మొత్తంగా బంగారు తెలంగాణను కాస్త బాకీల తెలంగాణగా ,బకాయిల తెలంగాణగా మారిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా మరొక్కసారి రు రుజువుకావడం జరిగింది..

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *