Type to search

తమిళ్ రీమేక్ లో తాన్యా హోప్

Actors Actresses Box Office Latest News News Trenging News

తమిళ్ రీమేక్ లో తాన్యా హోప్

Bangalore, actress, heroine, tanya, hope, Kollywood, Tandam, craze, Vijay, Tamil, remake, mohan, model, instagram, raatnam, Tanya Hope, south india, appatlo okadundevadu, patel S.I.R. , corrupt officer, special attraction, indru netra nalai, sandeep kishan, science fiction, comedy entertainment, femina miss-india, latest telugu updates, latest film newsబెంగళూరు ముద్దుగుమ్మ తాన్యా హోప్ దక్షిణాదిలో మంచి అవకాశాలు సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన తాన్యా, ఆ తరువాత నటించిన పటేల్ S.I.R సినిమాలో అవినీతి ఆఫీసర్ గా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కాలీవుడ్ లో తండం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కన్నడ సినిమాలలో బిజీ గా ఉన్న ఈ భామ మళ్ళీ ఒక తెలుగు సినిమా చేయనుంది.
తమిళ్ లో విజయం సాధించిన చిత్రం ‘ఇంద్రు నేత్రు నాలై’ చిత్ర రీమేక్ లో ఆమె నటించనుంది. ఈ చిత్రం లో సందీప్ కిషన్ సరసన కనిపించనుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్, హాస్య భరిత చిత్రం.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ చిత్రం షూటింగ్ జూన్ ఒకటి నుండి మొదలవుతుంది.
మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన తాన్యా 2015 లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికయ్యింది. ప్రస్తుతం ఆమె తన ఫోటోలతో ఇంస్తాగ్రం లో హల్ చల్ చేస్తుంది. ఆమెకు ఇంస్తాగ్రం లో 156 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *