Type to search

సాహోరే సుజీత్ రెడ్డి..!

Actors Actresses Box Office News

సాహోరే సుజీత్ రెడ్డి..!

Prabhas, saaho, sujith, surprise, instagram, raatnam, rebel star, shraddha kapoor, saaho teaser, saaho trailer, saaho music, saaho songs, saaho first look, saaho surprise, saaho release date, latest telugu films, latest film news, latest celebrity updates, saaho movie shraddha kapoor, shraddha kapoor in saaho movie, shraddha kapoor poster saaho, shraddha kapoor look from saaho, Saaho teaser, saaho movie teaser, prabhas saaho teaser, shraddha kapoor saaho teaser, sujeeth saaho teaser, saaho teaser released, saaho teaser is out, prabhas saaho teaser out now, shraddha kapoor saaho teaser is here, shraddha kapoor in saaho, sujeeth saahoవినోద రంగం అనే సరికల్లా ఇండియాలో మొదటగా ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఏంటంటే, టాలీవుడ్ గురించే చర్చంతా. ఒకప్పుడు మూవీస్, దాని బడ్జెట్ గురించి మాట్లాడాలంటే ముందు బాలీవుడ్ మాటొచ్చేది. ఇప్పుడు ఆ సీన్ మారి పోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే మాకు మాత్రమే సాధ్యం అనుకుని విర్ర వీగుతున్న తరుణంలో ఒక్కసారిగా సౌత్ ఇండియాకు చెందిన మణిరత్నం, శంకర్, పార్థిపన్ లాంటి వాళ్ళు రావడంతో షేక్ అయ్యింది. అంతేనా తమిళ, తెలుగు సినిమా రంగాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. శరవేగంగా మారిన టెక్నాలజీని వాడుకుంటూ సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. రాజమౌళి ప్రభాస్ తో తీసిన బాహుబలి ఇండియాలో సెన్సేషన్ హిట్ గా..బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర తిరగ రాసింది. అటు ఇతర దేశాల్లో కూడా డాలర్లను కోళ్ల గొట్టింది.

ఇప్పటి దాకా తలైవా , విజయ్ , కమల్ లాంటి వాళ్లకు మార్కెట్ వుంటే , ఇప్పుడు తెలుగు హీరోల హవా దేశాన్ని దాటి ఖండాతరాలు చుట్టేసింది. ఒక్కో హీరో రేంజ్ 100 కోట్ల బడ్జెట్ ను ఎప్పుడో దాటేసింది. వంగా సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డి , పరుశురాం తీసిన గీత గోవిందం, మహేష్ నటించిన శ్రీమంతుడు , మహర్షి సినిమాలు తెలుగు సినిమాకు కాసులు కురిపించేలా చేశాయి. ఇదే సమయంలో ఓ సునామీలా వచ్చాడు ఓ కుర్రాడు. బాహుబలి లాంటి ఒక రేంజ్ లో తీసిన సినిమా హిట్ అయ్యాక, ఇంకో సినిమా చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు ఏ నటుడైనా.. కానీ నటుడు ప్రభాస్ వేరు. అందుకే అతడంటే ఫ్యాన్స్ పడి చస్తారు. కేవలం 23 ఏళ్ళ వయసులో రన్ రాజా రన్ అనే ఒకే ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ సుజీత్ రెడ్డికి ఛాన్స్ ఇస్తాడని అనుకుంటారా ఎవరైనా.

కానీ జీవితంలో మరిచి పోలేని అవకాశం ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. దానిని చక్కగా వినియోగించు కున్నాడు డైరెక్టర్. అనంతపురం జిల్లాకు చెందిన ఈ యువకుడికి ఇప్పుడు 28 ఏళ్ళు. రెండేళ్ల పాటు టైమ్ తీసుకున్న అతడు సాహోరే మూవీకి వర్క్ చేశాడు. హాలీవుడ్ స్థాయిలో సినిమాను రిచ్ గా తీశాడు సుజీత్ రెడ్డి. ఇండియాలో ఈ సినిమా కు వచ్చినంత ప్రచారం ఇంకే సినిమాకు రాలేదు. ఒక్క టీజర్ విడుదలైన నిమిషాలల్లోపే కోట్లల్లోకి చేరి పోయింది. ఇది ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. మొత్తం సినిమా కోసం 375 కోట్లు ఖర్చు చేసారని టాక్. అయితే ఇప్పటికే 325 కోట్లు వచ్చేశాయని సమాచారం . మొత్తం మీద మనకూ దర్శకుడి రూపంలో ఓ మగాడు అయితే దొరికాడు కదూ.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *