Type to search

నన్ను టార్గెట్ చేస్తున్నారు అందుకే మీడియాకు దూరంగా ఉన్నా :సాహో డైరక్టర్

Actors Actresses Box Office News

నన్ను టార్గెట్ చేస్తున్నారు అందుకే మీడియాకు దూరంగా ఉన్నా :సాహో డైరక్టర్

‘సాహో’ చిత్రం విడుదల కాకముందే విపరీతం గా హైప్ క్రియేట్ అయింది. కానీ రిలీజ్ అయ్యాక చాలా నెగటివ్ టాక్ వచ్చింది .ఈ సినిమా దర్శకుడు సుజీత్ ను చాలా ట్రోల్ చేశారు కూడా.దీని పై స్పందించాడనికి కూడా సుజిత్ మీడియా కు దొరకలేదు . i. ఇటీవలే డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్న సుజీత్ తాజాగా సాహో విషయంలో తనపై వస్తున్న కామెంట్ల పై రియాక్ట్ అవుతూ… ”నేను ప్రభాస్ సర్‌తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం. చాలా మంది ప్రజలు ఈ సినిమా చూశారు. కానీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు” అని చెప్పుకొచ్చారు. నన్ను టార్గెట్ చేస్తూ అందరూ ఎందుకు వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదు. నేను చివరగా మూవీ రిలీజైన ఒక రోజు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. ‘నో కామెంట్స్’ అని నేను చెప్పినా కూడా అది ఇంటర్వ్యూగా మారిపోతోంది, ఆ కామెంట్లను కూడా నాకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సుజీత్ తెలిపారు.

నేను అనవసరంగా గొప్పులు చెప్పుకునే రకాన్ని కాదు . రజనీకాంత్, మమ్ముట్టి లాంటి గొప్ప గొప్ప స్టార్ల కోసం అభిమానులు గుళ్ళు కట్టారు. ఆ ఆలయాల వద్ద నేను భక్తుడిని మాత్రమే. సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. సినిమాను ప్రేమించండి లేదా ద్వేషించండి. అంతే కానీ నన్ను టార్గెట్ చేయడం ఎందకు? అని సుజీత్ తెగ ఫీల్ అయిపోతున్నారు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *