Type to search

ఎక్కడున్నా నిన్ను మరువలేము శ్రీదేవి !

Actors Actresses Box Office News

ఎక్కడున్నా నిన్ను మరువలేము శ్రీదేవి !

sri devi, actress sri devi, legendary actress sri devi, ntr, anr, chiranjeevi, kamal hassan, rajnikanth, sri devi movies, sri devi great movies, sri devi great actress, sri devi birth anniversary, sri devi birthday, jahnvi kapoor, kushi kapoor

శ్రీదేవి… ఈ అతిలోక సుందరి పేరు తెలియని సినిమా అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు .అటు పాత తరం నుంచి నేటి తరం వరకు అందరికి ఆమె పేరు సుపరిచితమే. బాలా నటి గా వెండి తెర కు పరిచయమై అందరినీ ఆకట్టుకుంది. హీరో ఎవరైనా సరే శ్రీదేవి హీరోయిన్ అయితే చాలు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు.

1963 ఆగస్టు 13 వ తేదీన శ్రీదేవి, పుట్టిన రోజు .అంటే ఈ రోజే . కణ్ణన్ కరుణై అనే సినిమా సినిమా లో బాలనటిగా వెండితెరకు పరిచయం అయిన ఆమె 16 ఏళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలచందర్ దర్శకత్వంలో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. తమిళ్ స్టార్ నటులు రజినీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. 1975 నుంచి 1985 మధ్యకాలంలో శ్రీదేవి తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

ఇక తెలుగులో కూడా ఆమె నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు , కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రనటులు, ఆ తరువాత తరమైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులతో సినిమాలు చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి 1996 లో బాలీవుడ్ సినీ నిర్మాత బోనికపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. జాన్వీ కపూర్, ఖుషి కపూర్. జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడాలన్నది ఆమె కల. ఆ కల నెరవేరకుండానే ఆమె మరణించింది ఫిబ్రవరి 24, 2018 వ సంవత్సరంలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ గదిలో స్నానాల గదిలో ప్రమాదవశాత్తు టబ్ లో జారిపడి మరణించారు.
అలా ఆమె భౌతికంగా దూరమయినప్పటికీ సినీ అభిమానుల గుండెలో ఎప్పటికీ నిలిచే ఉంటారు .

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *