Type to search

వెన్నెల్లో వేకువలు ఈ చిత్రాలు

News Top Stories

వెన్నెల్లో వేకువలు ఈ చిత్రాలు

art, pics, photographs, canvas, paintings, artist, raatnam, spandana reddy, hyderabad, spandana reddy hyderabad, spandana reddy paintings, spandana reddy artistప్రపంచాన్ని కాన్వాస్ లో బంధించే వాటిల్లో కెమెరా, పెన్నుతో పాటు పెన్సిల్ , బ్రష్ ..లాంటివి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలలు అంతా కంటారు కానీ కొందరే వాటిని నిజం చేస్తారు. అలాంటి వారిలో ఆర్టిస్టులు మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. వారి ప్రపంచం వేరుగా ఉంటుంది. వారి లోకం అందరికంటే భిన్నంగా కనిపిస్తుంది. కానీ ప్రతి నిమిషం ఏదో కొత్తదనం చూపించాలన్న తపన మాత్రం నిత్యం అగ్నిగుండం లాగా మండుతూనే ఉంటుంది. ఒక్కో కళాకారుడు ఒక్కో సైనికుడు. ప్రపంచాన్ని ఆవిష్కరించాలంటే బోలెడు ప్రయత్నాలు చేయాలి. పొద్దుటి నుంచి రాత్రి దాకా ఆలోచిస్తూనే ఉండాలి. గుండె మండి పోతే, మెదడు చిట్లి పోతున్నంతగా అనిపిస్తే అప్పుడు చిన్నగా చేతులు కదులుతాయి.

మానవ జీవితం , ఈ అనంతమైన ప్రకృతి, నిత్యం మనల్ని చైతన్యవంతం చేసి గుండెల్లో ప్రేమను నింపే ఆ సూర్యచంద్రులు, భూమిని ముద్దాడుకుంటూ పారే సెలయేర్లు, ప్రశాంతంగా ఉంటూనే ఒక్కోసారి ఉగ్ర రూపం దాల్చే నదులు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసే ఆ మంచు కొండలు, పర్వతాలు , అలలు , ఎగసి పడే జలపాతాలు, గెంతులు వేసే లేగదూడలు, మేఘాలు , కళ్ళు జిగేల్ మనిపించే నక్షత్రాలు ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఇంకెన్నో. ఇవ్వన్నీ కళాకారుడికి ప్రేరణ ఇస్తాయి. ప్రభావితం చేస్తూనే ఉంటాయి. సాహిత్యానికి, కళలకు పెట్టింది పేరు భారత దేశం. రవివర్మ , ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ళు ఎందరో ఉండగా..తెలుగు వాకిళ్ళలో గొప్పనైన ఆర్టిస్టులు లెక్కకు మించి ఉన్నారు. ఏలే లక్ష్మణ్ , నర్సిం , తదితరులు తమ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకునే ఆర్టిస్టులు ఎందరో.

ప్రస్తుతం హైదరాబాద్ ముందు నుంచీ కళాకారులకు స్వర్గ ధామంగా ఉంటోంది. నగరం నడిబొడ్డున రవీంద్ర భారతి , మరో వైపు లామకాన్ లు వీరికి ఓ వేదికను కల్పిస్తున్నాయి. ఇదే నగరానికి చెందిన మరో కళాకారిణి స్పందనా రెడ్డి తన పెయింటింగ్స్ తో కళాభిమానుల మనసు దోచుకుంటోంది. ఆమె చేతిలో కుంచె కొత్త పుంతలు తొక్కుతోంది. మనసు బావోలేనప్పుడు , గుండెను ఏదో తడిమినప్పుడు కుంచె కదులుతుంది. ఓ రూపం దాల్చుతుంది. లైఫ్ ఎంత అందమైనదో ..చెప్పాలంటే మాటలతో పని లేదు ఈ చిత్రాలు చూస్తే తెలుస్తుంది. ఆరాటాలకు ప్రతిరూపమే కాదు ఆర్ట్ అంటే అదో జీవన సంచారం. అదో ఆయుధం కూడా ..దారి చూపించే సాధనం కూడా. ఆమె చిత్రాలు పలు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లలో ప్రదర్శించారు. పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ప్రభుత్వ పరంగా ఆర్టిస్టులకు మరింత సపోర్ట్ లభిస్తే ఎంతో మేలు చేకూరుతుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *