Type to search

వరల్డ్ స్కిల్స్ పోటీల్లో విజేత శ్వేత

Latest News News Top Stories Trenging News

వరల్డ్ స్కిల్స్ పోటీల్లో విజేత శ్వేత

worldskill, world skills competition, world skills competition 2019, skill india, mahendra nath panday, india tv news, shweta ratanpura, shweta ratanpura world skills competitionనిన్న హిమ దాస్, పీవీ సింధు, మానసి జోషి, మను, భావన , మేరీకోమ్ లాంటి మహిళా క్రీడాకారులు ఇండియాకు తమ ప్రతిభా పాటవాలతో విజేతలుగా నిలిచి పేరు తీసుకు వచ్చారు. బంగారు పతకాలను గెలిచి ప్రపంచాన్ని విస్తు పోయేలా చేశారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఇండియాకు చెందిన శ్వేత రతన్ పురా డిజైనింగ్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచారు. చరిత్ర సృష్టించారు. గత కొన్ని ఏళ్లుగా ప్రతి ఏటా వివిధ అంశాలలో ప్రతిభా పాటవాలకు సంబంధించి పోటీలను నిర్వహిస్తున్నారు.

ఈసారి 2019 కు సంబంధింది రష్యాలోని కజాన్ లో కాంపిటీషన్స్ చేపట్టారు. గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో అద్భుతమైన రీతిలో ఇండియాకు చెందిన శ్వేత ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన వందలాది మందిని దాటుకుని గెలుపొందారు. ఇండియా వరకు వస్తే ఈ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో మొత్తం 19 పతకాలు మన వాళ్లకు దక్కాయి. ఇందులో శ్వేత మాత్రం బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు 1350 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. 63 దేశాలకు చెందిన వారు ఇందులో పార్టిసిపేట్ చేశారు. కాగా సాధించిన వాటితో ఓవర్ ఆల్ గా భారత దేశం టీమ్ 13 వ స్థానంలో నిలిచింది.

కేంద్రంలోని స్కిల్ డెవలప్ మెంట్ ప్రభుత్వ శాఖ ఈ మేరకు ప్రతిభా పాటవాలు ప్రదర్శించి, ఇండియాకు పేరు తీసుకు వచ్చిన వారిని అభినందిస్తున్నట్లు తెలిపింది. ఇండియా నుంచి మొత్తం 48 మంది పాల్గొన్నారు. మొత్తంగా గోల్డ్ మెడల్ సాధించిన శ్వేతను పలువు భారతీయులు అభినందనలు తెలియ చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. అంతకు ముందు 2017 లో అబూ దాబీలో జరిగిన పోటీల్లో ఇండియా టీమ్ 11 పతకాలు సాధించింది. స్కిల్స్ విషయంలో ఇండియాకు తిరుగు లేదని మరోసారి నిరూపించారు మన వాళ్ళు. భారత జాతీయ పతాకాన్ని ముద్దాడారు శ్వేత రతన్ పురా.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *