Type to search

కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

Latest News News Trenging News

కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

mangayamma, 72 year old gives birth to twins, andhra pradesh, east godavari, ap east godavari, 72 year old mangayamma gives birth to twins, 72 year old gives birth to twins in ap, 72 year old gives birth to twins in andhra pradeshఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ(73) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో మంగాయమ్మ ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు.
1992లో వివాహమైన మంగాయమ్మ ఏళ్లు గడిచినా తల్లి కావాలనే కోరిక తీరలేదు. ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. కాగా తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ ఐవీఎఫ్ పద్దతిని ఆశ్రయించింది. గడిచిన నవంబరులో గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌ను సంప్రదించింది. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. నేడు పండంటి శిశువులకు జన్మనిచ్చింది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *