Type to search

మళ్ళీ తెర పై కనబడనున్న బండ్ల గణేష్

Actors Box Office News

మళ్ళీ తెర పై కనబడనున్న బండ్ల గణేష్

mahesh, mahesh26, anil, krishna, raatnam, super star, mahesh babu, mahesh 26th film, sarileru neekevvaru, mahesh next film, mahesh next film sarileru neekevvaru, anil ravipudi, dil raju, sankranti release, vijay deverakonda, vijay deverakonda mahesh babu, vijay deverakonda in mahesh babu movie, vijay deverakonda in sarileru neekevvaru, bandla ganesh in sarileru neekevvaru, bandla ganesh, bandla ganesh movies, bandla ganesh again into actingకమెడియన్‌గా, నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నారు బండ్ల గణేశ్‌. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గానూ చాలా విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అక్కడినుండి నుంచి రాజకీయాలవైపు ప్రయాణించి ఆయన ఇప్పుడు మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు.. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో బండ్ల గణేశ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు . తాజాగా ఆయన చిత్ర బృందంతో కలిశారు. ఇందులో బండ్ల గణేశ్‌ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని, ఆ పాత్రకు ఆయన చక్కగా సరిపోతారని ఆ చిత్ర యూనిట్ తెలిపింది..

ఇందులో మహేశ్‌బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తికాగా, రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం లో విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు . దేవిశ్రీప్రసాద్‌ బాణీ లు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దిల్‌రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే సంవత్సరం విడుదల కాబోతోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *