Type to search

లాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్ధంకండి- దిల్ రాజు

Box Office News

లాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్ధంకండి- దిల్ రాజు

Sarileru Neekevvaru, Mahesh Babu Sarileru Neekevvaru, Sarileru Neekevvaru teaser, Sarileru Neekevvaru trailer, sarileru neekevvaru trailer, sarileru neekevvaru movie songs, mahesh babu latest movie, mahesh babu, mahesh babu teaser, sarileru neekevvaru first look, Sarileru Neekevvaru movie teaser, Anil Ravipudi, Sarileru Neekevvaru latest look, Sarileru Neekevvaru latest poster, tamannaah, pooja hedge, rashmika mandanna, rathnavelu, devi sri Prasad, dsp, vijaya shanthi look from Sarileru Neekevvaru, vijayashanthi Sarileru Neekevvaru look, sarileru neekevvaru new poster, Sarileru Neekevvaru Mahesh babu cut out, Sarileru Neekevvaru prerelease event, Sarileru Neekevvaru mega super event, Sarileru Neekevvaru prerelease event chief guest mega star chiranjeeviతాజాగా లాండ్‌ మార్క్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్ధంకండి అంటూ దిల్ రాజు బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సోషల్ మీడియా పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఈ అనౌన్స్‌మెంట్‌ మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ ప్రకటన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రానున్న ముఖ్య అతిథి గురించే అయ్యుంటుందని.. అందరూ ఊహించారు.
జనవరి 11న విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్న చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, సాంగ్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని, టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర హీరోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా ఈ ఈవెంట్‌ అప్‌డేట్‌ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రానున్న అతిథి విషయంలో మహేష్‌ క్లారిటీ ఇచ్చారు. జనవరి 5న జరగనున్న వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు మహేష్‌ బాబు కన్ఫర్మ్‌ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాధాలు. మీరు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. మిమ్మల్ని కలవడానికి ఎంతోగానో ఎదురు చూస్తున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి వీడియొ ను కూడా విడుదల చేశారు. మహేష్ బాబు ఫంక్షన్ కు మెగాస్టార్ హాజరు కావడం ఇదే మొదటి సారి.
జనవరి 5 2020 న ఎల్ బి స్టేడియం లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇది మెగా సూపర్ ఈవెంట్ కాబోతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. మెగా స్టార్ ఇంకా ప్రిన్స్ మహేష్ బాబులను ఒకే వేదిక పైన చూడడం ప్రేక్షకులకు కనుల పండుగ. ఈచిత్రేయమ్ ట్రైలర్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నా విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *