Type to search

అధిక ధరలు ఉంటే ఇసుక దోపిడీదారుల అక్రమ వ్యాపారానికి ఊతమివ్వడమే అవుతుంది

News Politics

అధిక ధరలు ఉంటే ఇసుక దోపిడీదారుల అక్రమ వ్యాపారానికి ఊతమివ్వడమే అవుతుంది

raatnam, sand, isuka, isaka, pawan kalyan, chandra babu naidu, chandra babu naidu government, jagan, jagan government, jagan government new policy on sand, lack of sand, constructions stoppedఅసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా ఉండేది భవన నిర్మాణ రంగంలోనే. సుమారు అర కోటి మందికిపైగా స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులు ఉపాధి పొందుతున్నది ఈ రంగంలోనే. ఉదయాన్నే అడ్డా దగ్గరకు చేరి పనుల కోసం ఎదురు చూసే వారికి గత వంద రోజులుగా కూలీ దొరకని స్థితిని తీసుకువచ్చారు. ఇందుకు కారణం నూతన ప్రభుత్వం ఇసుకను అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహించడమే.
గత తెలుగు దేశం ప్రభుత్వం పాలనలో ఇసుకను దోచేసినందున సంస్కరిస్తాం అన్న నూతన పాలకులు కొత్త విధానాన్ని తీసుకువచ్చి అమలు చేయడంపై దృష్టిపెట్టలేదు. ఇందుకోసం ముహూర్తాలుపెట్టుకోవడంతో జూన్ మాసం నుంచి నిర్మాణాలు నిలిచిపోయాయి.
తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో సైతం ప్రజలు ఇసుక కోసం ఇక్కట్ల పాలయ్యారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక ఇస్తాం అంటూ దోపిడీకి తెర లేపారు. ఆ తరవాత ఉచిత ఇసుక అని చెప్పి నేరుగా రేవుల్లోనే నాటి పాలక పక్షం నేతలు అడ్డగోలుగా తవ్వకాలు చేశారు. విధానం ఏదైనా టీడీపీ పాలనలో ఇసుక కోసం ప్రజలు ఇబ్బందిపడ్డారు. టీడీపీ ఓటమికి కారణాల్లో ఇసుక దోపిడీ కూడా ఒకటి అని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీరు చూస్తే గాదెలో ఎలుకలు ఉన్నాయని గాదెను తగులబెట్టినట్లు ఉంది.
మే నెలాఖరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన వైసిపి, గత ప్రభుత్వ హయాంలోని పథకాల రద్దులో భాగంగా ముందుగా రద్దు చేసిన పాలసీ ఉచిత ఇసుకే.
ఉచిత ఇసుక వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందన్న ప్రభుత్వం ఆ అవినీతికి కారకులైనవారిపై విచారణ చేసి చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదు? ఆ దిశగా కార్యాచరణ లేకుండా ఇసుక సరఫరా నిలిపివేశారు. జులై 11వ తేదీ పాత పాలసీ రద్దు చేస్తూ కొత్త పాలసీ వచ్చే వరకు ఇసుక తవ్వకాల మీద పూర్తి నిషేధం విధించారు.
రాష్ట్ర కార్మిక శాఖ దగ్గర నమోదైన భవన నిర్మాణ కార్మికుల సంఖ్య 19,34,158గా ఉంది. ఇందులో నమోదు కాని వారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు అంతకు కొన్ని రెట్లు మంది ఉంటారు. ఇసుక సరఫరా నిలిచిపోవడంతో వారికి ఉపాధి లేకుండాపోయింది. చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇంటికి మరమత్తు చేయించాలన్నా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతంలోనూ ఇతర ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిర్మాణ రంగం ఊపందుకొంది. మన రాష్ట్రంలోని కార్మికులే కాకుండా – భారీ నిర్మాణాల కోసం ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడ ఉపాధి కోసం వచ్చారు. నిర్మాణ రంగానికి అనుగుణంగా సిమెంట్, ఐరన్, తత్సంబంధిత వ్యాపారాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
నెలలో నాలుగు రోజులు పని దొరకడమే గగనమైపోతోందని అడ్డా కూలీలు ఆవేదనతో చెబుతున్నారు. మరో వైపు నిర్మాణ సంస్థలు పనులు ఆపేయడమే కాకుండా తమ దగ్గర ఉన్న చిరుద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి.
జూన్ మాసం నుంచి ఇసుక సరఫరా లేకపోవడంతో నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ వ్యాపారాలు అన్నీ మందగించాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర పన్నుల శాఖ ప్రభుత్వానికి ఆగస్ట్ నెలాఖరు వరకూ వసూలైన ఆదాయం వివరాలతో ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. నిర్మాణ రంగానికి అవసరమైన వ్యాపారాల వృద్ధిని తిరోగమనంలోకి తీసుకువచ్చారు.
నిర్మాణ రంగంలో నెలకొన్న సంక్షోభం మూలంగా కార్మికులతోపాటు నిర్మాణ సంస్థల్లోనూ, సంబంధిత వ్యాపారుల దగ్గర పని చేసే ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. ఆయా సంస్థలు క్రమంగా తమ దగ్గర ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి. ఒక మధ్య స్థాయి బిల్డర్ దగ్గర నలుగురు సూపర్ వైజర్లు ఉంటే ముగ్గురుని తొలగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది.
నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చేలోపు పాలకపక్షానికి చెందినవారు రీచుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి అత్యధిక ధరలకు విక్రయించుకొన్నా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూసింది.
ఈ నెల 5వ తేదీ నుంచి నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చినా – నిర్ణయించిన ధరలు ఎక్కువగా ఉన్నాయి. టన్ను ఒక్కింటికీ రూ.375గా ఖరారు చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ ధరకు వినియోగదారులకి ఇసుక సరఫరా చేస్తామంటూ చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ప్రజల నెత్తిన మరింత భారం మోపే దిశగానే అడుగులు వేస్తోంది. రవాణా ఖర్చులు టన్నుకు ఒక కి.మీ.కి రూ. 4.90గా నిర్ణయించింది. 10 కిలోమీటర్లకి ఒక టన్ను రవాణా ఖర్చు సుమారు రూ. 500 వస్తుందన్నది అంచనా. అదీ 10 కిలోమీటర్ల పరిధి లోపు మాత్రమే. ఈ లెక్కన చూస్తే టన్ను ఇసుక ధర రూ.875 అవుతుంది. ఈ ధరలపై ప్రభుత్వం తక్షణం సమీక్షించాలి. అధిక ధరలు ఉంటే ఇసుక దోపిడీదారుల అక్రమ వ్యాపారానికి ఊతమివ్వడమే అవుతుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *