Type to search

పేరు మాత్రమే బర్నింగ్ స్టార్ మనసు మాత్రం వెన్న !

Actors Actresses Box Office News

పేరు మాత్రమే బర్నింగ్ స్టార్ మనసు మాత్రం వెన్న !

Sampoornesh Babu, Sampoornesh Babu movies, Sampoornesh Babu money, Sampoornesh Babu funds, Sampoornesh Babu donation, Sampoornesh Babu sends money to cm relief fund, Sampoornesh Babu money to karnataka floodsప్రస్తుతం మన చుట్టపక్కల రాష్ట్రాలయిన కర్నాటక, కేరళ, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి, వేలాది మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ వరదల వలన వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ నేపథ్యం లో టాలీవుడ్ నుండి ముందుగా ఈ వరద బాదితులకి సాయం ప్రకటించిన రియల్ హీరోఎవరో తెలుసా బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు.

“ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. హృదయకాలేయం చూసి నన్ను కూడా ఎంతగానో ఆదరించారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను.” అని సంపూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సంపూ ఈ విషయంలోనే కాక గతంలో కూడా చాలా విషయాల్లో ముందుగా స్పందించి అందరి మన్ననలను పొందారు. తెలంగాణాలోని సిద్ధిపేటకి చెందినకూడా అయన ఏపీ యువత తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ విశాఖకు వెళ్ళిన సంపూర్నేష్ బాబుని అప్పట్లో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. గతంలో తిత్లీ తుఫాను, చెన్నై వరదల సమయంలో కూడా సంపూ తనవంతుగా ధనసహాయం చేశాడు. సో పెద్ద హీరోనా కాదా అనేకంటే మనసున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు సంపూ. ఇక సంపూ హీరోగా నటించిన కొబ్బరిమట్ట చిత్రం మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *