Type to search

విజయోత్సాహం లో సంపూ

Actors Actresses Box Office News

విజయోత్సాహం లో సంపూ

kobbari matta theatrical trailer, kobbari matta trailer, kobbarimatta theatrical trailer, kobbari matta telugu trailer, #sampoorneshbabu, kobbari matta teasers, kobbarimatta, sampoornesh babu, sampoornesh babu trailer, kobbari matta trailer response, kobbarimatta movie release, kobbarimatta movie response, kobbarimatta hit, sampoo happyబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన “కొబ్బరి మట్ట” చిత్రం ఆగస్ట్ 10 నా విడుదలయిన సంగతి తెలిసినదే. ఈ చిత్రం ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే అంచనాలకు తగినట్లు గానే ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు తమను నవ్వులతో ముంచెత్తాడని, కడుపుబ్బా నవ్వుకున్నామని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
కొబ్బరి మట్ట చిత్రం లో పాపారాయుడిగా, పెద్దరాయుడిగా, ఆండ్రోయిడ్ గా త్రిపాత్రాభినయం చేశాడు సంపూ. 2014 లో హృదయ కాలేయం చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంపూ మొదటి చిత్రం తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు కొబ్బరి మట్ట విజయం తో ఇది కలా నిజమా అని నమ్మలేకపోతుయిన్నానని అంటున్నాడు సంపూ. తెలుగు ప్రేక్షకులు తన పై చూపిస్తున్న ప్రేమకు తాను ఎప్పటికీ వారికి ఋణపడి ఉంటానని అంటున్నాడు సంపూ.
ప్రస్తుతం విజయవాడ లో ఉన్న సంపూ ఎడ తెగని ఫోన్ కాల్స్ తో, ఇంటర్వ్యూ లతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఈ చిత్ర విజయానికి నూతన దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ ప్రతిభే కారణమని తెలియజేశాడు సంపూ.
ఈ వారం విడుదలయిన మన్మధుడు 2 కు గట్టి పోటీ గా నిలచి విజాన్ని అందుకుంది కొబ్బరి మట్ట. ఈ ఆదివారం కొబ్బరి మట్ట చిత్రానికి థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వగా మన్మధుడు, రాక్షసుడు వంటి చిత్రాలు థియేటర్లు నిండక ప్రేక్షకుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *