Type to search

సంఝౌతా ఎక్స్ప్రెస్ ను అర్ధంతరంగా ఆపేసిన పాక్

Latest News News Trenging News

సంఝౌతా ఎక్స్ప్రెస్ ను అర్ధంతరంగా ఆపేసిన పాక్

Chandigarh, Punjab, Haryana, Jammu and Kashmir, Pak stops Samjhauta Express, Wagah, Indian crew escorts train to Attari, railway, India from Pakistan, Pakistan’s Federal Railways Minister Sheikh Rashid Ahmed, Samjhauta Express train, Samjhauta Express stopped, pak stops Samjhauta Expressఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ ను అర్ధంతరంగా ఆపేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. ఈ రోజు మధ్యానం 2.24 నిమశాలకు వాగాహ్ బోర్డర్ వద్ద సంఝౌతా ఎక్స్ప్రెస్ ను వాగ బార్డర్ వద్ద నిలిపి వేసింది పాకిస్తాన్. ఆ తరువాత భారత దౌత్యాధికారులు కలగ జేసుకొని ట్రైన్ ను భారత్ కు రప్పించారు.
“సంఝౌతా ” అంటే “ఒప్పందం”. ఇరు దేశాల మధ్య సత్సంభందాలు కొనసాగించడం కోసం 1976, జులై 22 న ప్రారంభించారు. ఈ ట్రైన్ డిల్లీ నుండి అత్తారి(భారత దేశం లో), అలాగే లాహోర్ నుండి వాగ (పాకిస్తాన్ లో) ప్రయాణిస్తుంది.

‘‘నేను రైల్వే మంత్రిగా ఉన్నంత కాలం సంఝౌతా ఎక్స్ప్రెస్ను నడపబోం’’ అని పాక్ రైల్వే మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అని ఆయన తెలిపారు. వాఘా సరిహద్దు వద్ద సంఝౌతా ఎక్ష్ప్రెస్స్ ను నిలిపేయడం పేయడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కశ్మీర్ విషయంలో భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తూ దౌత్య సంబంధాలను తగ్గించుకుంటామని ప్రకటించింది పాక్ ప్రభుత్వం. ఇప్పటికే భారత రాయబారిని బహిష్కరించిన పాక్.. వాణిజ్య సంబంధాలను కూడా నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో భారత సినిమాలను ఆడనీయొద్దని కూడా పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *