Type to search

మరో హిట్ కోసం ట్రై చేస్తున్న ‘సాయి తేజ్ ‘

Actors Actresses Box Office Latest News News Trenging News

మరో హిట్ కోసం ట్రై చేస్తున్న ‘సాయి తేజ్ ‘

సుప్రీం స్టార్ సాయి ధరం తేజ్ ప్రస్తుతం ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తేజ్ నటించిన చిత్రలహరి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ అందుకున్నా తన కెరీర్ గాడి లో పడాలంటే ఇంకో హిట్ కావల్సిందే. తేజ్ నటించబోయే తదుపరి చిత్రం పేరు క్రేజీ గా ఉండబోతుందని సమాచారం. ఈ కామెడి ఎంటర్టైనర్ చిత్రం లో సాయి తేజ్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రoలో రవితేజ సరసన ‘నేల టికెట్ ‘సినిమాలో నటించిన మాళవిక శర్మను తేజ్ కు జోడి గా నటించడానికి తీసుకున్నట్లు సమాచారం. ఇది 25 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యువిసి క్రేయషన్స్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో ఈ సినిమా ను ఎలా అయినా బాగా తీసి హిట్ సాధించాలని మారుతి భావిస్తున్నారు.
హీరో సాయి ధరం తేజ్ తన పేరు ని సాయి తేజ్ గా మార్చుకున్న తరువాత అతనికి కలిసి వచ్చినట్టు ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కు ‘భోగి’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇంకా అధికారికం గా ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి 2020 సంక్రాంతి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *