Type to search

సాహో సినిమా రివ్యూ

Actors Actresses Box Office Movie Reviews News Top Stories

సాహో సినిమా రివ్యూ

టైటిల్‌: సాహో
న‌టీన‌టులు: ప‌్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, జాకీష్రాప్‌, నీల్‌నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ప్ర‌కాశ్ బ‌ల్దేవ్‌, ఎవ్లిన్ శ‌ర్మ‌, సుప్రీత్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, టిను ఆనంద్‌
జాన‌ర్‌: యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది
ఎడిటింగ్‌: శ్రీక‌ర‌ప్ర‌సాద్‌
నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ – వంశీ
క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 172 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 30 ఆగ‌స్టు, 2019 Prabhas, saaho, sujith, raatnam, rebel star, shraddha kapoor, saaho teaser, saaho trailer, saaho music, saaho songs, saaho first look, saaho release date, saaho new poster, saaho movie new poster, v kannada, saaho tamil, saaho hindi, saaho telugu, saaho six shows, saaho in b c centers, saaho premieres, government permission to saaho, saaho movie GO, saaho review, saaho movie review, raatnam saaho review

బాహుబ‌లి త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా ఈ రోజు ఏకంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అతిపెద్ద బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ట్రైలర్, పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. దేశం మొత్తం సాహో ఫీవ‌ర్‌తో ఊగిపోయింది. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన `సాహో` ఆ క్రేజ్ ని నిలబెట్టగలిగిందా, బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటి ఏమిటి, దర్శకుడుగా సుజీత్ ఏం మ్యాజిక్ తెరపై చేశాడు ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

కథ
ముంబై లో జరిగిన 2000 కోట్ల దొంగతనంతో మొదలై 2 లక్షల కోట్ల చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కథ. సెకండ్ హాఫ్ నుంచి గాంగ్ స్టర్ లు ఉండే వాజీ సిటి మీదకి సినిమా స్టోరీ టర్న్ అవుతుంది. ప్రభాస్ ఎవరు? దొంగా? పోలీసా? పోలీస్ ఆఫీసర్ అయిన అమృతా నాయ‌ర్ (శ్ర‌ద్ధాక‌పూర్‌)తో ఎలా ప్రేమ‌లో ప‌డ‌తాడు. చివ‌ర‌కు అశోక్ గురించి ఆమెకు తెలిసే షాకింగ్ నిజం ఏంటి?
ఇక ముంబైలో జ‌రిగిన దొంగ తనానికి ప్ర‌భాస్‌కు సంబంధం ఏంటి, చివ‌ర్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వ‌చ్చే సిద్ధార్థ‌రామ్ సాహో ఎవ‌రు ? అన్న‌ది తెరపై చూడాలి. ఏం రివీల్ చేసినా మీ ఆసక్తి పోతుందని… కథ గురించి ఇక్కడితో ఆగిపోతున్నాం.

Prabhas, saaho, sujith, raatnam, rebel star, shraddha kapoor, saaho teaser, saaho trailer, saaho music, saaho songs, saaho first look, saaho release date, saaho new poster, saaho movie new poster, v kannada, saaho tamil, saaho hindi, saaho telugu, saaho six shows, saaho in b c centers, saaho premieres, government permission to saaho, saaho movie GO, saaho review, saaho movie review, raatnam saaho reviewవిశ్లేషణ:
ప్రభాస్ ఎంట్రీ… మన అంచనాలకు తగ్గట్టే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కథానుసారం ఫస్టాఫ్ లోనే రెండు పాటలు వచ్చేస్తాయి. సినిమాలోని ఉన్న దాదాపు ముఖ్య పాత్రలు అన్నీ కూడా ఫస్టాఫ్ లోనే పరిచయం చేసిన ద‌ర్శ‌కుడు..ఆ ప‌రిచ‌యం చేయ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడు. క‌థ‌ను మెయిన్ ట్రాక్‌లోకి ఎక్కించేందుకే దాదాపుగా గంట సేపు తీసుకుంటాడు… ఇక్కడ టైం కిల్ అయ్యింది. ప్రభాస్ మరియు శ్రద్దాల మధ్య కెమిస్ట్రీ గొప్ప‌గా లేదు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. విజువల్స్ మాత్రం ఈ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఎక్క‌డా లేని ఆస‌క్తి క్రియేట్ అవుతుంది.
ద‌ర్శ‌కుడు సుజీత్ సింపుల్ క‌థ తీసుకుని దాని చుట్టూ యాక్ష‌న్ అల్లుకోవ‌డంతో సినిమా అంతా యాక్ష‌న్ డామినేష‌న్ ఎక్కువైంది. ట్విస్టులు, యాక్ష‌న్‌కు ఇచ్చిన ప్ర‌యార్టీ రొమాన్స్‌, కామెడీ, ఎమోష‌న‌ల్‌కు ఇవ్వ‌లేదు. దీంతో తెర‌పై కామెడీ, ఎమోష‌న‌ల్‌, రొమాంటిక్ సీన్లు వ‌స్తున్నా ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేక‌పోయాడు. కాకపోతే ఆ విజువల్ వండర్, యాక్షన్ సన్నివేశాలు ఆ పొరపాట్లను మరిచిపోయేలా చేస్తాయి. ఇంట‌ర్వెల్ నుంచి సినిమా ఇంకా లేస్తుంది.
మనకు హాలీవుడ్ గురించి గొప్పగా ఫీలవడం అలవాటు కదా. ఈ సీన్లను గతంలో చూసిన హాలీవుడ్ సన్నివేశాలతో పోల్చుకుంటే కాపీ అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా సీన్లు హాలీవుడ్ సినిమాల సీన్ల‌ను గుర్తుకు తెస్తాయి. ఓ విధంగా చెప్పాలంటే క్ల‌బ్ చేసిన‌ట్టే ఉంటుంది. అయినా వాటిని తెర‌మీద‌కు తీసుకు రావ‌డంలో టెక్నీషియ‌న్లు ప‌డిన క‌ష్టం మెచ్చుకోవాలి. టెక్నిక‌ల్‌గా అన్ని విభాగాల‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి. ఈ సినిమాను మన ఇండియన్ సినిమాలా ఫీలై… అందులో ప్రభాస్ పరకాయ ప్రవేశాన్ని గమనించడం మొదలుపెడితే ప్రేక్షకుడికి నచ్చుతుంది.Prabhas, saaho, sujith, raatnam, rebel star, shraddha kapoor, saaho teaser, saaho trailer, saaho music, saaho songs, saaho first look, saaho release date, saaho new poster, saaho movie new poster, v kannada, saaho tamil, saaho hindi, saaho telugu, saaho six shows, saaho in b c centers, saaho premieres, government permission to saaho, saaho movie GO, saaho review, saaho movie review, raatnam saaho review

బాహుబలి ఎఫెక్ట్
బాహుబలి కాకపోతే వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఓ నటుడుగా ప్రభాస్ పైనా, ఆయన్ని డీల్ చేసే దర్శకుడుపైనా ఏ స్దాయి ప్రెజర్ ఉంటుందో ఊహించవచ్చు. ప్ర‌భాస్ చాలా తెలివిగా బాహుబలికి క్వయిట్ ఆపోజిట్ గా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు ఏ స్టార్ డైరక్టర్ ని ఎంచుకున్నా అంచనాలు మరింత పెరుగుతాయి. కొత్త డైరెక్టర్ (రెండో సినిమా) కావడంతో జనాలకు కొన్ని అనుమానాలు కలగడం ప్రభాస్ కు మంచే చేస్తుంది. అయితే… ఎప్పుడైతే సాహో పాన్ ఇండియా సినిమా అయ్యిందో అప్పుడే సినిమాలో తెలుగు నేటివిటి త‌గ్గి… హిందీ నేటివిటి ఎక్కువైంది.

Prabhas, saaho, sujith, raatnam, rebel star, shraddha kapoor, saaho teaser, saaho trailer, saaho music, saaho songs, saaho first look, saaho release date, saaho new poster, saaho movie new poster, v kannada, saaho tamil, saaho hindi, saaho telugu, saaho six shows, saaho in b c centers, saaho premieres, government permission to saaho, saaho movie GO, saaho review, saaho movie review, raatnam saaho review

పాజిటివ్స్ :
ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి ఫలితం ఇచ్చినా… ప్రభాస్ కు అయితే ప్లస్సే గాని మైనస్ కాకపోవచ్చు. మాచో లుక్‌తో ప్రేక్షకులని కట్టి పడేశాడు హీరో ప్రభాస్ .. డైరెక్టర్ సుజీత్ ప్రభాస్ ని చూపించిన స్టైలిష్ లుక్ , తెలివైన హీరోయిజం , యాక్షన్ సీన్ లలో పర్ఫెక్షన్ ఇవన్నీ ఫాన్స్ కి పండగ అనే చెప్పాలి. ఒక పాన్ ఇండియా స్టార్ ని అద్దిరిపోయే యాంగిల్ లో చూపించారు దర్శకుడు. స్టంట్ సీన్ లలో ప్రభాస్ ఒన్ మ్యాన్ షో ఈ సినిమా కి హైలైట్ గా నిలుస్తుంది. కథ ముందే తెలిసినా కథనం ఆసక్తికరంగా, ట్విస్టుల‌తో సాగుతుంది. విలన్స్ కారెక్టర్ లని డిజైన్ చేసిన తీరు, వాజీ సిటి డార్క్ మూడ్ , ఊహించని ట్విస్ట్స్ ఇవన్నీ సినిమాకి అతిపెద్ద ఆస్తులు. గిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది .. ప్రభాస్ మ్యానరిజంకు అనుకూలంగా అది సాగింది. ఆఖరి నలభై నిమిషాలలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లు ఇండియన్ సినిమా చరిత్ర లోనే ఒక అద్భుతం అని చెప్పాలి.

నెగిటివ్:
ఈ సినిమా కి మొదటి నుంచీ పాటలు ఎంత నెగెటివ్ అనేది మనకి తెలిసిందే. ఏ పాటా కూడా సరిగ్గా ఆకట్టుకోలేదు. కానీ టేకింగ్ లో మాత్రం అన్నీ పాటలూ చాలా రిచ్ గా ప్లాన్ చేశారు. baby dont you love me సాంగ్ విజువల్ గా అద్దరగొట్టారు . రొటీన్ కథ కావడం తో ప్రేక్షకులు చాలా చోట్ల సహనం కోల్పోతారు. ఒకట్రెండు యాక్షన్ ఎపిసోడ్ లు ఎక్కువైన భావన కలుగుతుంది. యాక్షన్ సీన్స్ ఎక్కువ కావడం వల్ల దర్శకుడి ఏకాగ్రత వాటిమీదే ఎక్కువ ఫోకస్ అయి మిగతా అంశాల్లో క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమా కథ బేస్ లైన్ డైరెక్టర్ యొక్క మొదటి సినిమా రన్ రాజా రన్ నుంచే తీసుకున్నట్టు అనిపిస్తుంది స్పష్టంగా… రెగ్యులర్ తెలుగు సినిమాలు నుంచి ఆశించే ఫన్, రొమాన్స్ కు పెద్దగా అవకాశం లేకపోవడం మైనస్. వెన్నెల కిషోర్ ఉన్నా పెద్దగా ఫన్ పండలేదు. అయితే అది సినిమాకు మైనస్ కాలేదు.

ఫైనల్‌గా…
మొత్తం మీద చూసుకుంటే ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా పండగ. యాక్షన్ ఎపిసోడ్ లు బాగా రాసుకున్న దర్శకుడు దాని చుట్టూ కథ రాసుకోవడంలో తడబడ్డాడు… ఆఖరి నలభై నిమిషాలతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. ద‌ర్శ‌కుడు సుజీత్ సింపుల్ స్టోరీకి యాక్ష‌న్ అల్లేశాడు. బేసిగ్గా యాక్షన్ సినిమా కాబట్టి హింస కాస్త ఎక్కువైంది. కథలో కాకుండా యాక్షన్ తోనే సంతృప్తి చెందాలి.

సాహో రేటింగ్‌: 3/ 5
.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *