Type to search

టెలికాం సెక్టార్ లో వార్ షురూ – తెర తీసిన రిలయన్స్

Latest News News Top Stories Trenging News

టెలికాం సెక్టార్ లో వార్ షురూ – తెర తీసిన రిలయన్స్

Jio, Jio Fiber Offers, Jio Fiber Plans, Jio Fiber Plans Price, Jio Fiber Price, Jio Giga Fiber, Jio Giga Fiber Offers, Jio Giga Fiber Plans, Jio Giga Fiber Price, mukesh ambani, Reliance Jio, Reliance Jio Giga Fiber, Reliance JioFiber, Reliance JioFiber Connection, Reliance JioFiber Plans, Reliance JioFiber Subscriptionప్రపంచాన్ని తన కనుసన్నలలో పెట్టుకుని ఆటాడిస్తున్న ఐటి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజు రోజుకు సాంకేతికపరమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఇంటర్నెట్ వాడకం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది టోటల్ గా గ్లోబల్ ను డామినేట్ చేస్తూ వస్తోంది. భారత దేశం ఇప్పుడు వర్ధమాన దేశాల సరసన నిలబడింది. ప్రపంచ వ్యాపార రంగంలో పూర్తిగా మూడో ప్లేస్ ను ఆక్రమించింది. ఇది ఓ రకంగా ఇండియన్ మార్కెట్ కు మంచి చేసినా రాబోయే కాలంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. ప్రతి దేశమూ సాంకేతికంగా అప్ డేట్ కాకపోతే అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోయే ప్రమాదం ఉన్నది.

ఐటీ సెక్టార్ లో అమెరికా టాప్ పొజిషన్ లో ఉండగా అందులో మన దేశానికి చెందిన వారు దాదాపు 30 శాతానికి మించి ఉన్నారని అంచనా. తాజా గణాంకాల ప్రకారం భారత దేశం 128 కోట్లకు పైగా జనాభా కలిగి ఉన్నదని తేలింది. దీంతో ఆసియా ఖండంలో అతి పెద్ద మార్కెట్ ను కలిగిన దేశాలలో చైనా తర్వాత మనదే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు చెందిన కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించాలంటే చైనా, భారత్ లే అతి పెద్ద ఆదాయ వనరులుగాగుర్తిస్తున్నాయి. అందుకే ప్రతి కంట్రీ ఈ ప్రాంతాలలో బిజినెస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇక ఇండియాకు చెందిన కంపెనీలు సైతం డెవలపింగ్ కంట్రీస్ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు అక్కడ కూడా తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు ఏషియన్ కాంటినెంట్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇండియన్ బిజినెస్ రంగాన్ని శాసిస్తున్న ఒకే ఒక్క కంపనీ అదేమిటంటే ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.

ఇప్పటికే తన బిజినెస్ ను విస్తరించుకుంటూ లెక్కలేనంత ఆదాయం గడిస్తోంది. ఆయిల్, టెలికాం, లాజిస్టిక్, ఈ కామర్స్, జ్యుయెలరీ ,డిజిటల్ టెక్నాలజీ , ఇలా ప్రతి రంగానికి విస్తరించింది. తాజగా టెలికాం రంగాన్ని ఒంటి చేత్తో డామినేట్ చేసే స్థాయికి ఎదిగింది. తన నిర్ణయాలతో ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. జియో కొట్టిన దెబ్బకు ఎయిర్ టెల్ , వోడా ఫోన్ , ఐడియా , బిఎస్ ఎన్ ఎల్ , తదితర కంపెనీలు విలవిలలాడి పోతున్నాయి. ధీరుభాయి అంబానీ కన్న కలల్ని నిజం చేయాలన్న సంకల్పం ఇప్పుడు ఆర్ ఐ ఎల్ ఆచరణలోకి తీసుకు వస్తోంది. ఇండియాలోని ప్రతి కుటుంబం ఇంటర్నెట్ తో అనుసంధానం కావాలన్న టార్గెట్ తో పని చేస్తోంది. అతి తక్కువ ధరకే అన్ని సేవలు అందజేయనున్నట్లు ఆర్ ఐ ఎల్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల ముంబైలో ప్రకటించారు.

ఇంకేం ఒక్క సారిగా షేర్స్ పెరిగాయి. మదుపరులకు లాభాలు వచ్చాయి. అత్యంత స్పీడ్ కలిగిన సర్వీసెస్ తాము అంద జేసేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఆ మేరకు టారిఫ్ లను ఆర్ ఐ ఎల్ ప్రకటించింది. టీవీ , వీడియో కాలింగ్ , కొత్త సినిమాలు చూసే వెసలు బాటు, అపరిమిత ఇంటర్నెట్ వాడకం లాంటి సదుపాయాలు అందజేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని 1600 నగరాలకు ప్రస్తుతం అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరింప చేస్తారు. 699 రూపాయల నుండి 8499 రూపాయల దాకా ఈ ప్లన్స్ ఉన్నాయి. కస్టమర్లు ఎంచుకునే దానిని బట్టి డేటా , స్టోరేజ్ లాంటివి అందుబాటులోకి వస్తాయి. రిలయన్స్ కొట్టిన దెబ్బకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిర్ టెల్ , వోడా , బీఎస్ ఎన్ ఎల్ కంపెనీలు తమ టారిఫ్ లను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మొత్తం మీద రాబోయే కాలంలో రిలయన్స్ ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *