Type to search

మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసం అంటే నమ్మలేదు.. కానీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు అంటున్న శర్వానంద్

Actors Actresses Box Office News

మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసం అంటే నమ్మలేదు.. కానీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు అంటున్న శర్వానంద్

ranarangam, ranarangam movie, ranarangam teaser, ranarangam trailer, ranarangam release date, ranarangam posters, ranarangam movie stills, ranarangam songs, ranarangam sharwanand, ranarangam kalyani priyadarshini, ranarangam kajal aggarwal, raatnam, ranarangam trailer launch, ranarangam trivikram, trivikram to ranarangam trailer launch, ranarangam trailer talk, ranarangam trailer talk raatnamయంగ్ హీరో శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `రణరంగం`. 1980 బ్యాక్‌డ్రాప్ నుండి ఇప్పటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీ తో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ట్రైలర్‌ని దర్శకుడు త్రివిక్రమ్ శనివారం కాకినాడలో రిలీజ్ చేశారు.

“ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహాల్ కట్టాడనుకుంటే డబ్బులెక్కువై అనుకున్నా.. కానీ కొంత మంది కోసం కట్టొచ్చు. ఖర్చు పెట్టొచ్చు` అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది . ఫ్లాష్ బ్యాక్‌కి సంబంధించి శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్‌లో సీన్స్ చూపించారు. స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విధించారు. దాంతో మందు తాగే వాళ్ల కోసం సముద్ర ద్వారా మందును స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకునే సీన్స్ వాటివలన జరిగేగ్యాంగ్ వార్స్‌ని ట్రైలర్‌ లో చూపెట్టారు.
ఇక ఇంకో సన్నివేశం లో విదేశాల్లో 40 ఏళ్లున్న హీరో, అక్కడ మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో పరిచయం, కొన్ని సన్నివేశాలను చూపించారు.
మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసం అంటే నమ్మలేదు.. కానీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు అంటూ హీరో విలన్స్‌తో చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ఎండ్ అయింది.
గ్యాంగ్ స్టర్ స్టోరీ ని ఆసక్తికరంగా సుధీర్ వర్మ రూపొందించారు. ప్రశాంత్ పిళ్లై నేపథ్య సంగీతం, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అదుర్స్ అనిపిస్తున్నాయి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *