Type to search

భల్లాల దేవా ఈజ్ బ్యాక్

Box Office News

భల్లాల దేవా ఈజ్ బ్యాక్

Rana Daggubati, Rana Daggubati movies, Rana Daggubati latest movies, Rana Daggubati latest news, Rana Daggubati upcoming movies, Rana Daggubati gunasekhar, gunasekhar, gunasekhar movies, gunasekhar latest movies, gunasekhar upcoming movies, gunasekhar next movie, gunasekhar needs assistant directors, gunasekhar about hiranyakashyapa, hiranyakashyapa, hiranyakashyapa movie, hiranyakashyapa movie update, rana daggubati gunasekhar hiranyakashyapaటాలీవుడ్‌లో కండల వీరుడు గా పేరు తెచ్చుకున్నరానా కు చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . కానీ ఇటీవల లాంగ్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ సినిమాల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ఇక ఇటీవల రానాకు సర్జరీ జరిగి . ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక త్వరలోనే షూటింగ్‌ల్లో పాల్గొని.. తాను అంగీకరించిన సినిమాలన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇదిలా ఉంటే రానాతో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ సినిమాను తీయాలనుకున్న సమాచారం తెలిసిందే. కానీ అనారోగ్యం కారణంతో రానా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడని, మరో హీరోతో ఈ సినిమాను తీసుకోవాలని గుణశేఖర్‌కు సూచించాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో రానాను తప్ప మరో హీరోను ఊహించుకోని గుణశేఖర్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టినట్లు టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలన్నింటికి తాజాగా దర్శకుడు చెక్ పెట్టాడు.

‘‘తెలుగు భాషపై పట్టు, తెలుగు సాహిత్యంపై అవగాహన కలిగి ఉన్న వారు సహాయ దర్శకులుగా చేసేందుకు తనకు సంప్రదించాలని’’ గుణశేఖర్ సోషల్ మీడియాలో ప్రకటించారు . అందుకనే ఇప్పుడు హిరణ్యకశ్యప ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతోంది..? ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు నటించబోతున్నారు..? ఎప్పుడు విడుదల చేయనున్నారు..? ఈ ప్రశ్నలన్నింటికి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది . రానా ఈ సినిమా తో పాటు ‘విరాటపర్వం’, ‘హాథీ మేరీ సాథీ’, ‘బిజు: ది ఇండియన్ ప్రైడ్’ వంటి చిత్రాలు చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *