Type to search

తారలు దిగివచ్చిన వేళ.. సినీ ప్రేమికుల ఆనంద హేల

Actors Actresses Box Office News

తారలు దిగివచ్చిన వేళ.. సినీ ప్రేమికుల ఆనంద హేల

movies, raatnam, raatnam media, tollywood, tfi, heroes, heroines, actors, actresses, film makers, cine mahotsavam, radhasaradhula rajatotsavam, telugu cinema production executives union 25 years, hyderabad gachibowli, rajatotsava vedukalu, chiranjeevi, balakrishna, nagarjuna, venkatesh, ram charan, allu arjun, rashi khanna, pooja hegde, rakul preet singh, regina, anasuyaవెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినీ తారలందరూ ఒకే వేదికపై కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’ పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.

రీసెంట్‌గా కర్టన్ రైజర్ ఈవెంట్ నిర్వహించి, కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి, సి.కళ్యాణ్, జెమినీ కిరణ్, డా.రాజశేఖర్, అల్లరి నరేష్, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ‘సినీ మహోత్సవం – రథసారధుల రజతోత్సవం’ సెప్టెంబర్ 8వ తేదీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు .

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఆది, ఆది సాయి కుమార్, సందీప్ కిషన్, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్, రెజీనా, అనసూయ తదితరులు హాజరు కానున్నారు . త్వరలో పాస్‌లు ఆన్ లైన్‌లో లభిస్తాయని చెప్పారు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *