Type to search

ప్రమాదం పై స్పందించని రాజ్ తరుణ్

Actors Actresses Box Office News Trending Videos Trenging News

ప్రమాదం పై స్పందించని రాజ్ తరుణ్

online telugu news, telugu news live, Actor Raj Tarun Escaped From Car Incident In Hyderabad, Raj Tarun Escaped From Car Incident, Actor Raj Tarun, Raj Tarun Car Incident, #RajTarun, #RajTarunCar, raj tharun about his car accidentటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారు ఝామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ పేరును అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తరుణ్ అని అనడం, ఇంకా ఆదే పేరు తో హీరో ఉండడం తో మొదట్లో హీరో తరుణ్ కారు యాక్సిడెంట్ అని పొరపాటుగా కథనాలు వెలువడ్డాయి.
కానీ తరుణ్ స్వయంగా తాను ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నట్లు క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తకు తెరపడినత్తయింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లోని అల్కాపురి టౌన్ షిప్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఒక గోడను ఢీ కొట్టి చెట్లలోకి దూసుకెళ్ళడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి కానీ సేఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

రాజ్ తరుణ్ షూటింగ్ ముగించుకొని తిరిగివచ్చే సమయంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని అంటున్నారు. అయితే సిసిటీవీ విజువల్స్ లో మాత్రం రాజ్ తరుణ్ ఫేస్ కనపడడం లేదు. అసలు కారును వదిలేసి వెళ్ళిపోయింది రాజ్ తరుణ్ ఔనా కాదా అనేది తెలియాల్సి ఉంది. రాజ్ తరుణ్ మద్యం సేవించి కారు నడిపి ఉంటాడా? అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారని తెలుస్తోంది.

అయితే ఈ సందేహాలన్నిటికి తెరపడాలంటే రాజ్ తరుణ్ స్వామిగా ప్రకటించా వలసినదే. ఇన్ని వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ సంఘటనపై రాజ్ తరుణ్ స్పందించక పోవడం తో ఆ కార్ లో ఉన్నది రాజ్ తరుణ్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *