Type to search

రికార్డుల మోత మోగిస్తున్న రాఫెల్ నాదల్

Latest News News Sports Trenging News

రికార్డుల మోత మోగిస్తున్న రాఫెల్ నాదల్

US Open, tennis, rafael nadal, daniil medvedev, nadal, medvedev, sports, finals, highlights, us open 2019, us open highlights 2019, us open men's final 2019, rafael nadal us open 2019, rafael nadal vs daniil medvedev, daniil medvedev us open, rafael nadal salary, rafael nadal remuneration, rafael nadal worth, rafael nadal world recordఉత్కంఠ భరితంగా సాగిన యుఎస్ ఫైనల్లో స్పెయిన్ కు చెందిన రాఫెల్ నాదల్ విజయం సాధించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ గెలుపుతో 19 వ టైటిల్. ఇది కూడా ఓ చరిత్రే. రాఫెల్ మొత్తం ఆదాయం 37,684 , 949 మిలియన్ డాలర్లు. ఆదాయం గడించే ఆటగాళ్లలో మొదటి ప్లేస్ లో నిలిచారు. ఆయన సాధించిన రికార్డులను మరే ఆటగాడు బ్రేక్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటి దాకా 43 టైటిల్స్ పొందారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ , ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ , యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లాం లను సాధించారు. ఒలంపిక్స్ పోటీల్లో బంగారు పతకాలను పొందారు. డబుల్స్ విభాగంలో ఏడు టైటిల్స్ గెలిచారు. ఆయన అసలు పేరు రాఫెల్ “రాఫా ” నాదల్ పరేరా.

అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ప్రకటించిన జాబితాలో నాదల్ ను నెంబర్ వన్ ఆటగాడిగా ప్రకటించింది. అన్నికాలాలలో ఉన్న ఉత్తమమైన క్రీడాకారులలో ఒకడిగా అతనిని పేర్కొంది. “ది కింగ్ ఆఫ్ క్లే” అంటూ ముద్దుగా అభిమానులు పిలుస్తారు. గొప్ప క్లే కోర్ట్ ఆటగాడిగా నిపుణులు భావించేటట్టు చేసాయి. తొమ్మిది గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్, 18 ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్ 1000 పోటీలతో పాటు 2004, 2008 , 2009లో ఫైనల్స్‌లో విజయం సాధించిన స్పెయిన్ డేవిస్ కప్ జట్టులో భాగంగా ఉన్నారు. అగస్సీ తర్వాత కెరీర్ గోల్డెన్ స్లామ్‌ను పూర్తి చేసిన రెండవ ప్లేయర్ గా పేరు పొందారు. 15 ఏళ్ళ వయసులో వృత్తి పరమైన క్రీడాకారుడు అయ్యాడు. జూనియర్ విభాగంలో నాదల్ రెండు పోటీలలో పాల్గొన్నాడు. 2002లో, 16 ఏళ్ళ వయసులో బాలుర సింగిల్స్ సెమీ-ఫైనల్ చేరాడు. 17 ఏళ్ళ నాటికి, మొదటిసారి ఆడినప్పుడు ఫెడరర్‌ను ఓడించాడు .

19 ఏళ్ళ వయసులో మొదటిసారి ఆడి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు, ప్రపంచంలో ఉన్న 50 మంది క్రీడాకారులలో స్థానం సంపాదించారు. 2003లో ఏటీపీ న్యూ కమర్ ఆఫ్ ది ఇయర్ గా నాదల్ ను ప్రకటించింది. రమోన్ డెల్గాడోను ఓడించి 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో దీనిని ఓపెన్ ఎరాలో సాధించిన తొమ్మిదవ ఆటగాడు అయ్యాడు. రెండు ఛాలెంజర్ పురస్కారాలను గెలిచాడు. 2003లో జరిగిన వింబుల్డన్ ఆటలో బెకర్ తరువాత మూడవ రౌండు చేరిన అతిచిన్న వయస్కుడిగా పేరు పొందారు. ప్రపంచ ఆటగాడు రోజర్ ఫెడరర్‌తో మియామీ మాస్టర్స్‌లో ఆడి వరుస సెట్లలో గెలుపొందాడు. క్లే కోర్ట్ సీజన్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాడు. వరుసగా 24 సింగిల్స్ ఆటలను గెలిచాడు. బార్సిలోనాలో టోర్నియో కాండో డే గోడోను, గుల్లెర్మో కారియాను మాంటె కార్లో, రోమ్ మాస్టర్స్‌లో ఓడించాడు.

2005 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో ఫెడరర్‌పై గెలుపొందాడు. ప్రథమ స్థానంలో ఉన్న క్రీడాకారుడిని ఓడించిన నలుగురు ఆటగాళ్ళలో నాదల్ కూడా ఒకరు. ఫైనల్‌లో మారియానా ప్యుర్టాను ఓడించి 1982లో మాట్స్ విలాండర్ తర్వాత మొదటి ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచిన రెండవ క్రీడాకారుడు అయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలవటం వల్ల నాదల్ స్థానం మెరుగై మూడో ప్లేస్ కు చేరుకుంది. 2005లో పదకొండు సింగిల్స్ టైటిల్స్, నాలుగు ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ బాగెల్ అవార్డును పొందాడు. మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎట్టకేలకు నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు.

కియా మోటర్స్ సంస్థకు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. నైక్ కంపెనీకి చెందిన దుస్తులు, షూస్ కు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఇంటర్నేషనల్ కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు. వీటి ద్వారా ఆయనకు భారీ ప్రాఫిట్ సమకూరుతోంది. రాఫా క్వెలీ సంస్థకు అంతర్జాతీయ దూతగా ఉన్నాడు. రిచర్డ్ మిల్లె వాచీని వాడాడు. దానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎంపోరియో అర్మానీ అండర్‌వేర్ ప్రకటనల్లో ఉన్న రొనాల్డోను తొలగించి రాఫెల్ ను వాడుకున్నారు. షకీరా విడుదల చేసిన “జిప్సీ” వీడియోలో నాదల్ కనిపించారు. ఇటీవల స్పానిష్ ఫుట్‌బాల్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు. రాఫా రియల్ మాడ్రిడ్ సాకర్ క్లబ్ వీరాభిమాని. రాఫా 10 శాతం వాటాను కలిగి ఉన్నాడు.

స్పానిష్ జాతీయ జట్టుకు వీరాభిమాని, రాఫెల్ ఆటగాడు మాత్రమే కాదు దాతృత్వం కలిగిన ప్లేయర్. ది రాఫా నాదల్ పేరుతో ఓ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశాడు. ఆట నుంచి నిష్క్రమించినప్పుడు మరింత సేవ చేసేందుకు మార్గం ఏర్పడుతుందని అన్నారు నాదల్. నేను ఈ స్థాయికి చేరు కోవడానికి ఈ సమాజమే కారణం. నేను పొందిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి కదా అందుకనే ఈ సంస్థను ఏర్పాటు చేశానని చెప్పారు. మలేరియాకు వ్యతిరేకంగా రియల్ మాడ్రిడ్ గోల్‌కీపర్ ఐకెర్ కసిలాస్‌తో కలసి రెడ్ క్రాస్ చేపట్టిన బెనిఫిట్ మ్యాచ్ నుంచి నాదల్ స్ఫూర్తిని పొందాడు, రాఫా భారతదేశంలో పర్యటించాడు, మొత్తం మీద ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిగమించడమే కాదు తనలో మానవత్వం దాగి ఉందని లోకానికి చాటి చెప్పాడు.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *