Type to search

‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్ విడుదల

Box Office News

‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్ విడుదల

raatnam, pratiroju pandaage, pratiroju pandaage first look, pratiroju pandaage motion poster, Sai Tej, Raashi Khanna, Maruthi, Thaman, pratiroju pandage, Raashi Khanna pratiroju pandaage, sai dharam tej pratiroju pandaage, sathyaraj pratiroju pandaage, pratiroju pandaage glimpse, pratiroju pandaage teaser, pratiroju pandaage trailer, sai dharam tej movies, sai dharam tej latest movies, sai dharam tej prati roju pandage glimpse, tej prati roju pandage trailer talkమారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయితేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడులవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు.
ఈ సంధర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను థియేటర్‌లో కుటుంబంతో కలిసి చూస్తే వచ్చే ఆనందం వేరు. చెప్పిన టైమ్‌కి మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు అని అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడానికి సహకరించిన నా టీమ్‌కి, గీతా, యూవీ బ్యానర్స్‌కు థ్యాంక్స్‌. కథ వినగానే చేద్దామని తేజ్‌ చెప్పాడు. సత్యరాజ్‌గారు ముందు తాత పాత్ర చేయనన్నారు. కథ విన్నాక ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘సాయితేజ్‌ సినిమా చేస్తున్న ప్పుడు ఇతర పాత్రలకు ప్రాధా న్యం ఉండేలా చూస్తాడు. తన పాత్రతో పాటు ఇతర పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తే ఎంత మంచి సినిమా వస్తుందో చిరంజీవిగారికి బాగా తెలుసు. ఆయన లక్షణం తేజ్‌లో ఉంది’’ అన్నారు అల్లు అరవింద్‌
‘‘మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘చిత్రలహరి’ సినిమాతో నా సెకండ్‌ కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఇప్పటి నుండి మీరు (మెగా అభిమానులు) తలెత్తుకునే సినిమాలే చేస్తాను. ‘ప్రతిరోజూ పండగే’ మీ అంచనాలకు మించి ఉంటుంది. ఇందుకు నాది, మారుతిది గ్యారెంటీ’’ అన్నారు సాయితేజ్‌. ‘‘అందరికీ నచ్చే సినిమా ఇది. తేజ్‌తో మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను’’ అన్నారు రాశీఖన్నా. సంగీత దర్శకుడు తమన్, నటుడు రావు రమేశ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. పల్లెటూరు నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని జీఎ2, యువీ క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *