Type to search

పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా ‘జాన్‌’

Box Office News Trenging News

పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా ‘జాన్‌’

Raatnam, Prabhas, Prabhas movies, Prabhas latest movies, Prabhas upcoming movies, Prabhas saaho, saaho, jaan, Prabhas jaan, Prabhas pooja hegde, pooja hegde jaan, pooja hegde, jaan movie, jaan trailer, jaan shoot, radhakrishna, uv creations, jaan romantic movie, prabhas jaan period movie, jaan period movie, jaan Europe, latest telugu movie updates, periodic love story, periodic love story jaan, kajal aggarwalప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జాన్‌’ . ప్రస్తుతం జాన్ వర్కింగ్ టైటిల్ గా వున్నా ఇదే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ‘సాహో’ చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు.మొదట ఈ చిత్రాన్ని పూర్తి గ్రాఫిక్స్ తో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడ్ ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన సెట్లు వేసి షూటింగ్ జరపనున్నారు.
‘సాహో’ రిలీజ్‌ అప్పుడు ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ సంక్రాంతి పండగ తర్వాత తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఆరు సెట్లను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. విదేశాలలో కూడా చిత్రీకరణ జరగనుంది. ఇప్పటికే ప్యారిస్ లో కొన్ని పార్టులు షూటింగ్ జరుపుకుంది. ఇందులో ప్రభాస్‌ పురాతన వాహనాల దొంగ పాత్రలో కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు అమితి త్రివేది సంగీత దర్శకుడు.ఈ చిత్రాన్ని హింది, తెలుగు, తమిళ్ బాషలలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *