Type to search

ఓ బేబీ రివ్యూ …

Actors Actresses Box Office Movie Reviews News

ఓ బేబీ రివ్యూ …

అవ్వ అమ్మాయిగా మారి తెగ నవ్వించి , ఏడిపించిన ఓ బేబీ

ఓ బేబీ రివ్యూ …

నటీనటులు: సమంత, లక్ష్మి, నాగసౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, ప్రగతి తదితరులు
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
ఫోటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
నిర్మాత: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా
దర్శకత్వం: నందిని రెడ్డి
raatnam, Oh Baby, Oh Baby first look, Oh Baby teaser, Oh Baby trailer, Oh Baby telugu movie, Oh Baby samantha movie, samantha, samantha movies, nandini reddy, Naga Shaurya, BV Nandini Reddy, d suresh babu, Mickey J Meyer, Mickey J Meyer music, Richard Prasad, Oh Baby Theatrical Trailer, oh baby latest trailer, oh baby official trailer, samantha akkineni, samantha akkineni oh baby, samantha akkineni oh baby movie review, raatnam oh baby review, oh baby review by raatnam, oh baby movie review, review of samantha akkineni oh babyసమంత హీరోయిన్ గా చేసిన ఓ బేబీ మూవీ ఈరోజు విడుదల అయ్యింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలను సినిమా రీచ్ అయిందా లేదా చూద్దాం …
లక్ష్మి చిన్నవయసులోనే వివాహం జరుగుతుంది. యుక్తవయసులోకి రాగానే ఆమె భర్తను కోల్పోతుంది. ఇక పెద్దవయసు వచ్చాక తన పిల్లలు, మనవళ్లతో కలిసి ఉంటుంది. కానీ, వయసు మీద పడే కొద్దీ ఆమె లో చాదస్తం బాగా పెరుగుతుంది. ఆమె ప్రవర్తన వలన కోడలు సావిత్రి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.ఆమెకున్న , అతి ప్రేమ వలన ఆమెను అక్కడ ఉంచితే పిల్లలు కూడా అలాగే మారిపోతారేమో అని కొడుకు ఆమెను తీసుకెళ్లి ఓ వృద్దాశ్రమంలో ఉంచుతాడు.
దీంతో ఆమెలో ఆమె చాలా బాధపడ్తుంది .తిరిగీ యవ్వనం గా మారిపోతే ఎలాఉంటుందని ఆలోచిస్తూంటుంది . అదే సమయంలో తనకు తెలియకుండా వయసు తగ్గిపోతుంది. యుక్తవయసులో ఉంటె ఎలా ఉండాలని అనుకుందో ఆ కలను నిజం చేసుకునే రోజు వస్తుంది. అసలు వృద్ధురాలి గా ఉన్న లక్ష్మి.. యుక్తవయసులో ఉన్న సమంతగా ఎలా మారింది..? తన కలలు ఏంటి..? వాటిని ఎలా నెరవేర్చుకుంది అన్నది మిగతా కథ .raatnam, Oh Baby, Oh Baby first look, Oh Baby teaser, Oh Baby trailer, Oh Baby telugu movie, Oh Baby samantha movie, samantha, samantha movies, nandini reddy, Naga Shaurya, BV Nandini Reddy, d suresh babu, Mickey J Meyer, Mickey J Meyer music, Richard Prasad, Oh Baby Theatrical Trailer, oh baby latest trailer, oh baby official trailer, samantha akkineni, samantha akkineni oh baby, samantha akkineni oh baby movie review, raatnam oh baby review, oh baby review by raatnam, oh baby movie review, review of samantha akkineni oh babyవిశ్లేషణ:
మిస్ గ్రానీ చూసిన వాళ్లకు ఈ మూవీ కథ ను గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొరియన్ మూలాలున్న.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశారు. టోటల్ ఎంటర్టైనర్ గా సినిమాగా తెరకెక్కించారు . యవ్వనం చేతిలో ఉండగా ఏదో సాధించాలని అనుకుంటాం. అలా ఆలోచిస్తూ ఉండగానే..వయసైపోతుంది. అయ్యో అప్పుడు ఏం చేయలేకపోయామే అని మదనపడిపోతుంటాం . అలంటి వాళ్లకు తిరిగి వయసు తగ్గిపోతే.. జీవితం లో ఎలా ఉంటారు. అనేదే కాన్సెప్ట్. ఈ స్టోరీ లైన్ ను నందిని రెడ్డి చక్కగా మలిచారు. ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్టైనర్ గా సాగిపోతుంది. బేబీగా లక్ష్మి, సమంతలు పోటీ పడి నటించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ ఉండటం విశేషం. అక్కడక్కడా సెంటిమెంట్ ను పెడుతూ.. ఆ వెంటనే కామెడీని మిక్స్ చేస్తూ నడిపించారు.

సెకండ్ హాఫ్ లో ఇదే గ్రిప్పింగ్ కొనసాగింది. అయితే, సెకండ్ హాఫ్ కామెడీ పాళ్ళు కొద్దిగా తక్కువగా ఉంది.. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం అందరికి నచ్చుతుంది.raatnam, Oh Baby, Oh Baby first look, Oh Baby teaser, Oh Baby trailer, Oh Baby telugu movie, Oh Baby samantha movie, samantha, samantha movies, nandini reddy, Naga Shaurya, BV Nandini Reddy, d suresh babu, Mickey J Meyer, Mickey J Meyer music, Richard Prasad, Oh Baby Theatrical Trailer, oh baby latest trailer, oh baby official trailer, samantha akkineni, samantha akkineni oh baby, samantha akkineni oh baby movie review, raatnam oh baby review, oh baby review by raatnam, oh baby movie review, review of samantha akkineni oh babyనటీనటులు :
ఈ మూవీ లో అందరూ పోటీపడి నటించారు.ఇక సమంత నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోవాల్సిందే.ఇటు కామెడీ, అటు ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించింది. లక్ష్మి సైతం సమంతతో పోటీ పడింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ల నటనకు వందకు వంద వేయాల్సిందే .ఇందులో జగపతిబాబు కీ రోల్ పోషించారు.
టెక్నీకల్ టీమ్ వర్క్ ::
సినిమాను నందిని రెడ్డి డీల్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది .సాధారణం గా నందిని రెడ్డి సినిమాలంటే కలర్ ఫుల్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉన్నది. మంచి స్క్రీన్ ప్లే తో నందిని ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా తీసేందుకు ఆమె పడిన కష్టం కనబడుతోంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరాపనితనానికి మంచి మార్కులు పడుతాయి . మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *