Type to search

అబ్బా ట్రాఫిక్ రూల్స్ దెబ్బ..జంకుతున్న జనం..సర్కారుకు ఆదాయం

News Top Stories

అబ్బా ట్రాఫిక్ రూల్స్ దెబ్బ..జంకుతున్న జనం..సర్కారుకు ఆదాయం

Motor Vehicles (Amendment) Bill, traffic violations, Motor Vehicle, Accident Fund, road safety, Indian roads, defective vehicles, road accidents, driving licence, vehicle registration, hit and run, Juvenile Justice Act, drunk driving, Delhi traffic, AADHAAR, motor insurance, challan, india traffic rules, Rajya Sabha, Rajya Sabha Chariman, M Venkaiah naidu, Rajya Sabha 249 session, lok sabha, zero hour, question hour, bills passed, Opposition, Fines, raatnam, bharat ane nenu, mahesh babu, koratala siva, people trouble, incme to governmentఅభివృద్ధిలో దూసుకు వెళుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ లో మాత్రం గీత డాటా లేక పోతోంది. మెట్రో రైలు ప్రారంభామైనా ట్రాఫిక్ కస్టాలు తప్పడం లేదు. వేలాది మంది తమ అవసరాలు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం నగరంలో ప్రయాణం చేస్తున్నారు. కాస్తంత చినుకు పడితే చాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనిని ఏమాత్రం నియంత్రించలేని స్థితిలో హైదరాబాద్ నగర పాలక సంస్థ ఉంటోంది. ఉన్నది ఒకే ఒక్క దారి కావడంతో పలు చోట్ల రహదారుల విస్తరణ, నగర జనాభాకు అనుగుణంగా వసతులు లేక పోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మెట్రో వల్ల కొంత మేరకు తగ్గినా, ఐటి కంపెనీలు ఉండడంతో ఎంప్లొయీస్ ఎక్కువగా స్వంత వాహనాలను వినియోగిస్తున్నారు. తక్కువ ధరకే వాహనాలు లభిస్తుండడంతో ప్రతి ఒక్కరు వీటి ద్వారానే ప్రయాణం చేస్తున్నారు. దీంతో వాహన కాలుష్యం కూడా ఎక్కువవుతోంది. ఇదే సమయంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రస్తుత ప్రభుత్వం రవాణా శాఖా కు కొత్త మార్గదర్శకాలు నిర్దేశింది. మోటార్ రవాణా చట్టంలో మార్పులు చేసింది.

రోడ్డు ప్రమాదాలు పెరిగి పోవడం, చాలా మంది వాహనదారులు చని పోవడం, మరి కొందరు తీవ్రంగా గాయ పడటం జరుగుతుండడంతో కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం నడుపుతూ వాహనాలు నడిపితే తీవ్రంగా పరిగణిస్తోంది. మద్యం తాగినా, సిగ్నల్స్ జంప్ చేసినా ఉన్న లైసెన్స్ రద్దు చేస్తోంది. ఇప్పటి దాకా జరిమానాలతో వదిలేసిన అధికారులు ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేస్తున్నారు. కొత్తగా కఠినమైన రూల్స్ పొందు పరిచింది. దీని వల్ల వాహనదారులు కంట్రోల్ లో ఉంటారని రవాణా శాఖా భావిస్తోంది. ఎన్ని చట్టాలు రూపొందించినా, మార్పులు చేసినా ఫలితం కనిపించడం లేదు. అయిన దానికి కాని దానికి చాలాన్స్ వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము ఇష్టం వచ్చినట్లు నడిపితే డ్రైవర్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కన్సిడర్ చేయడం లేదు. దీంతో హైదరాబాద్ లో ప్రయాణం అంటేనే జడుసుకుంటున్నారు.

ఎక్కడ పడితే అక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫైన్స్ వేస్తున్నారంటూ లబోదిబో మంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి పాయింట్లను కేటాయిస్తున్నారు. ఈ పాయింట్ల సంఖ్య ఐదు దాటితే లైసెన్స్ ను రద్దు చేస్తున్నారు. ఈ పాయింట్ల సంఖ్య పెరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ను పూర్తిగా రద్దు చేయనున్నారు. కొత్త రూల్స్ దెబ్బకు వాహనదారులు అబ్బా అంటున్నారు . గత ఏడాది సెప్టెంబర్ లో ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది. చలానా కట్టేస్తే సరిపోతోందనే ధీమాతో పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇక ఈ కొత్త విధానంతో ముకుతాడు పడనుంది. ఈ నిబంధనల కారణంగా భారీ ప్రమాదాలను తప్పించే అవకాశాలున్నాయని రవాణా శాఖాధికారులు అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడింది . సంఖ్య ఐదు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు.

కొత్తరూల్స్ వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణీకులను ఎక్కించుకొంటే 1 పాయింట్ కేటాయిస్తారు. సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణీకులను ఎక్కించుకొంటే 2 పాయింట్లు, హెల్మెట్ సీట్లు, బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపితే 1 పాయింట్, రాంగ్ రూట్ లో వాహనం నడిపితే ఒక్క పాయింట్ వేస్తారు . నిర్ధేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే 2 పాయింట్లు, నిర్ధేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3 పాయింట్లు కేటాయిస్తారు. సిగ్నల్స్ అంటేనే వాహన దారులు జంకుతున్నారు. సిగ్నల్ జంప్ చేసినా, ప్రమాదకరంగా వాహనం నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినా రెండు పాయింట్లు కేటాయిస్తారు. మద్యం తాగి బైక్ నడిపినా, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకెళ్తే మూడు పాయింట్లు, మధ్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణ వాహనం నడిపితే నాలుగు పాయింట్లు కేటాయిస్తారు. మద్యం తాగి ప్రయాణీకులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను నడిపితే 5 పాయింట్లు కేటాయిస్తారు.

ఇబ్బంది కలిగేలా వాహనాన్ని నడిపినా, వాయు కాలుష్యానికి కారణమైనా, అనుమతిలేని చోట పార్క్ చేసినా రెండు పాయింట్లు కేటాయిస్తారు. భీమా పత్రం లేకుండా వాహనం నడిపితే రెండు పాయింట్లు, అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే రెండు పాయింట్లు, ర్యాష్ డ్రైవింగ్, ఎదుటివారి భద్రతకు ముప్పు వాటిల్లేలా నడిపితే రెండు పాయింట్లు, నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే 5 పాయింట్లు, వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడి, ఇతర నేరాలకు పాల్పడితే 5 పాయింట్లు కేటాయిస్తారు. సీసీ కెమెరాలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ట్రాఫిక్ కూడళ్ళలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారులు ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ చలానాలు పంపుతున్నారు. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. కూడళ్ళలోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించినా కెమెరా కంటికి కన్పిస్తారు.

ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ కు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని రవాణా శాఖ డేటా బేస్ కు ఎప్పటికప్పుడు లెక్క కడుతుంటారు. రెండేళ్ళ సమయాన్ని గడువుగా చేసుకొని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజు వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. మళ్ళీ కొత్త ఖాతా మొదలౌతోంది. మళ్ళీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్ళ పాటు తదుపరి పునరావృతమైతే మూడేళ్ళపాటు లైసెన్స్ ను రద్దు చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ దెబ్బకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సినీ నటులు, బిజినెస్ మేన్స్ , ఉమెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సిటీలో వేలాది మంది చలానాలు అందుకున్న వారే . తాజాగా డీజీపీ కూడా చేరారు. మొత్తం మీద ఇంత కఠినంగా ఉంటె ఎలా అని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ మాత్రం ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా ఉండాల్సిందేనని అంటున్నారు. ఇప్పటి వరకు చాలానాలా రూపేణా రాష్ట్ర సర్కార్ కు భారీ ఆదాయం సమ కోరుతోంది. దేశ వ్యాప్తంగా ప్రమాదాల నివారణలో భాగంగా విధించిన ఫైన్స్ తో లక్షలాది రూపాయలు సమకూరుతున్నాయి. ఏది ఏమైనా కఠినతరమైన చట్టాలు అవసరమే కానీ మరీ ఇంతలా ఉంటె ఎలా అని అంటున్నారు. మరో వైపు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న వాహనదారులకు పోలీసులు బహుమతులు ఇస్తున్నారు. ఫ్రీగా సినిమాలు చొసేందుకు టికెట్స్ ఇస్తున్నారు. ఇలాగైనా కట్టు తప్పకుండా ఉంటారని ప్రయత్నం చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Next Up