Type to search

Chandrayaan-2 : ఆత్మస్థైర్యం కోల్పోవద్దు…

Latest News News

Chandrayaan-2 : ఆత్మస్థైర్యం కోల్పోవద్దు…

chandrayaan 2.0, chandrayaan launch live, isro live, sriharikota, chandrayaan 2, chandrayaan 2 live, chandrayaan 2 launch video, chandrayaan 2 live streaming, chandrayaan 2 countdown, isro live chandrayaan 2, isro live stream, isro live channel, raatnam, prabhas, saaho, prabhas about chandrayaan 2.0, bahubali, chandrayaan 2.0 bahubali, narendra modi about chandrayaan 2.0, narendra modi at isroChandrayaan-2 : ఆత్మస్థైర్యం కోల్పోవద్దు… ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు…
ISRO Chandrayaan-2 : చంద్రయాన్-2 విషయంలో ఇస్రోకు దేశంలోని ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు
ISRO Chandrayaan-2 : చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శాస్త్రవేత్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్న ఆయన… మరింత కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వెయ్యాలన్నారు. ఇలాంటి అడ్డంకులు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయన్న ఆయన.. వాటికి ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాలన్నారు. ఇస్రో కంట్రోల్ సెంటర్ నుంచీ ప్రసంగించిన ప్రధాని మోదీ… ఈ ప్రయోగం కోసం నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతీ శాస్త్రవేత్తనూ అభినందించారు. శాస్త్రవేత్తల ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఆయన… వారి శ్రమను దేశ ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా చంద్రయాన్ గురించి రాస్తే… ఫెయిలైందని రాయరన్న మోదీ… చివరి క్షణం వరకూ చందమామను చేరుకోవడానికి ప్రయత్నించారనే రాస్తారని అన్నారు.

అంతరిక్ష ప్రయోగాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయన్న మోదీ… వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మరిన్ని లక్ష్యాల్ని సాధించాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు సంతోషించే మరిన్ని విజయాలు భవిష్యత్తులో వస్తాయన్న మోదీ… నెక్ట్స్ టైమ్ మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని చూసి దేశం గర్విస్తోందన్న మోదీ… ఇప్పటివరకూ జరిగిన జర్నీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రమండల యాత్ర కొనసాగుతుందన్న ఆయన.. మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తామన్నారు. ఇప్పటివరకూ ఇస్రో సాధించిన విజయాల్ని గుర్తుచేసిన మోదీ… మరిన్ని ప్రయోగాలు చెయ్యాలనీ, తాను, దేశం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *