Type to search

‘లవ్‌స్టోరీ’ కోసం ‘చై’ పాట్లు

Box Office News Trenging News

‘లవ్‌స్టోరీ’ కోసం ‘చై’ పాట్లు

Naga Chaitanya, Naga Chaitanya movies, Naga Chaitanya movie with sai pallavi, Naga Chaitanya sai pallavi, Naga Chaitanya sekhar kammula, sai pallavi, sai pallavi movies, sai pallavi sekhar kammula, sai pallavi naga chaitanya, Naga Chaitanya sai pallavi sekhar kammula, Naga Chaitanya sai pallavi sekhar kammula movie release on christmas, raatnam, Naga Chaitanya sai pallavi sekhar kammula dance based movie, Naga Chaitanya dance based movie, sekhar kammula dance based movie, Naga Chaitanya in nizam accent, Naga Chaitanya nizam guy, Naga Chaitanya sai pallavi sekhar kammula movie titled love story, Naga Chaitanya sai pallavi movie love story, love storyనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ రూపొందుతోంది. వీరద్దరి కాంబినేషన్లో ఇది మొదటి చిత్రం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది. చైతన్య తెలంగాణా యాస పై పట్టు కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. మలి షెడ్యూల్‌ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది.
ఈ ‘లవ్‌స్టోరీ’ విడుదలకు డేట్‌ లాక్‌ చేశారని సమాచారం. ఏప్రిల్‌ 2న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్‌ వచ్చే మిడిల్ క్లాస్ యువకుడిగా నాగచైతన్య, కలను నిజం చేసుకోవాలనుకునే తపనతో తన ఊరి నుంచి హైదరాబాద్‌ చేరుకునే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎలా ప్రేమ చిగురించింది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది అని తెలుస్తోంది.
చైతన్య ప్రస్తుతం తన మేనమామ, వెంకీ తో “వెంకీ మామ” అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కోసం సిద్దం గా ఉంది. డిసెంబర్ 13 నా వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సాయి పల్లవి “విరాట పర్వం 1992” చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *