Type to search

జియో గిగాఫైబర్ సేవలు షురూ.. పూర్తి ప్లాన్ల వివరాలు ఇవే..!

Latest News News Top Stories Trenging News

జియో గిగాఫైబర్ సేవలు షురూ.. పూర్తి ప్లాన్ల వివరాలు ఇవే..!

Jio, Jio Fiber Offers, Jio Fiber Plans, Jio Fiber Plans Price, Jio Fiber Price, Jio Giga Fiber, Jio Giga Fiber Offers, Jio Giga Fiber Plans, Jio Giga Fiber Price, mukesh ambani, Reliance Jio, Reliance Jio Giga Fiber, Reliance JioFiber, Reliance JioFiber Connection, Reliance JioFiber Plans, Reliance JioFiber Subscriptionజియో గిగా ఫైబర్ లో 6 ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించారు. జియో ఫైబర్‌ ప్లాన్లను బ్రాంజ్‌, సిల్వర్‌, గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌, టైటానియం కేటగిరీలుగా విభజించింది. కనీస ప్లాన్‌ ధర రూ.699 కాగా గరిష్ఠ నెలవారీ ధర రూ.8,499గా నిర్ణయించారు.
*1) కనీస (బ్రాంజ్) ప్లాన్‌ రూ.699 ఎంచుకుంటే 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ+50జీబీ అదనపు డేటాను అందించనున్నారు. ఇందులోనే ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ సదుపాయాలు ఉంటాయి.

* 2) సిల్వర్ ప్లాన్‌ ధర రూ.849. దీని వేగం 100 ఎంబీపీఎస్‌. 200జీబీ+200జీబీ అదనపు డేటాతో ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి.

*3) గోల్డ్ ప్లాన్ రూ.1,299తో 250 ఎంబీపీఎస్‌ వేగంతో డేటా పొందవచ్చు. ఇందులో 500జీబీ+250జీబీ అదనపు డేటా లభిస్తుంది.

* 4) డైమండ్ ప్లాన్ 500 ఎంబీపీఎస్‌ వేగం కావాలంటే రూ.2,499 ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఇందులో భాగంగా 1250జీబీ+250జీబీ అదనపు డేటా పొందవచ్చు.

* 5) ప్లాటినం ప్లాన్ రూ.3,999తో 2,500 జీబీ,
* 6) టైటానియం ప్లాన్ రూ.8,499 తో 5 వేల జీబీల డేటా పొందొచ్చు. ఈ రెండు ప్లాన్లలో డేటా వేగం 1 జీబీపీఎస్‌ ఉంటుంది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ సదుపాయాలు ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఉంటాయి.

జియో ఫైబర్‌ వెల్‌కమ్‌ ఆఫర్‌
జియో ఫరెవర్‌ వార్షిక ప్లాన్లను ఒకేసారి ఎంచుకొనే వినియోగదారులకు వెల్‌కమ్‌ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందులో భాగంగా వినియోగదారులు జియో హోం గేట్‌వే, జియో 4K సెట్‌టాప్‌ బాక్స్‌, గోల్డ్‌ ప్లాన్‌ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ వారికి టీవీ, ఓటీటీ యాప్స్‌ చందా వంటి వాటిని ఉచితంగా అందించనుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *