Type to search

మా’ అసోసియేషన్‌లో చిరంజీవి , రాజశేఖర్ల మధ్య మాటల యుద్ధం

Box Office News Trenging News

మా’ అసోసియేషన్‌లో చిరంజీవి , రాజశేఖర్ల మధ్య మాటల యుద్ధం

maa, rajasekhar, jeevitha, raatnam, jeevitha rajasekhar, movie artists association, naresh, maa president naresh, paruchuri gopala Krishna, maa general body meeting, chiranjeevi, movie artists association chiranjeevi and rajasekhar dispute, chiranjeevi rajasekharమూవీ ఆర్ట్స్ (మా’) అసోసియేషన్‌లో వివాదాలు కొత్తకాదు… చాలా సందర్భాల్లో ఇవి బయటపడుతూనే ఉన్నాయి… ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ 2020 ఆవిష్కరణ సందర్భంగా వివాదం మళ్ళీ బయట పడింది
. మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ డాక్టర్ రాజశేఖర్‌గా పరిస్థితి మారిపోయింది.. పరుచూరి గోపాలకృష్ణ వద్ద నుంచి మైక్ లాక్కొని మాట్లాడిన రాజశేఖర్… ‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో ఉన్న విభేదాలపై రాజశేఖర్ ఫైర్ అయ్యారు. చిరంజీవి బాగా మాట్లాడారు… కానీ, ఇండస్ట్రీలో నిప్పురాజుకుంటుంది.. నిప్పుని కప్పి పుచ్చితే పొగరాకుండా ఉండదన్నారు. ఇజశేఖర్… ఇక, చిరంజీవి, మరోవైపు మోహన్ బాబు రాజశేఖర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు…
తరువాత

మా అసోసియేషన్ వల్ల తన ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయన్న ఆయన.. తనకు కారు ప్రమాదం కూడా ఇందువల్లే జరిగిందన్నారు. నిందలొచ్చినా ఫర్లేదని.. తాను ఎప్పుడూ నిజమే చెబుతానని అంటూ వేదికపై ఉన్న ప్రముఖులందరికీ రాజశేఖర్ కాళ్లు మొక్కారు. ఇక ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు
తరువాత చిరంజీవి మాట్లాడుతూ.. రాజశేఖర్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రోటోకాల్ పాటించని వ్యక్తుల గురించి ఏం మాట్లాడగలమని.. ఇక్కడ తన మాటకు విలువే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్‌కు తాను అన్నీ అర్ధమయ్యేలా చెప్పానని.. మంచి ఉంటే మైకులో చెప్పమని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలన్నానని స్పష్టం చేశారు. అయినా కూడా వినకుండా తన నుంచి మైకు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా, పథకం ప్రకారమే రసాభాస చేసేందుకు రాజశేఖర్ యత్నించారని చిరంజీవి ఆరోపించారు. అంతేకాకుండా రాజశేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *