Type to search

పూరీ కి ప్రామిస్ చేసిన మెగా స్టార్ చిరు !

Actors Actresses Box Office News

పూరీ కి ప్రామిస్ చేసిన మెగా స్టార్ చిరు !

puri jagannadh, puri jagannadh ismart shankar, puri jagannadh movies, puri jagannadh latest movies, puri jagannadh upcoming movies, puri jagannadh chiranjeevi, chiranjeevi promises puri jagannadh, chiranjeevi, chiranjeevi movies, chiranjeevi movie with puri jagannadh, chiranjeevi sye raa narasimha reddy, ismart shankar responseమెగాస్టార్ చిరంజీవి ని డైరక్ట్ చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి. చాలా మంది డైరక్టర్ల జీవితాశయమే అది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ డ్రీమ్ కూడా అదే. కానీ ఆ కల
కలగానే మిగిలిపోయింది ఇంత కాలం. చిరు వారసుడు రామ్ చరణ్‌ పూరి దర్శకత్వంలో లాంచ్ చేశారు. కానీ పూరితో సినిమా చెయ్యడానికి చిరు మాత్రం ఎందుకో అంతగా ఆసక్తి చూపించలేదు.

పూరి ఆటోజాని కథ చెప్పాడని, సెకండ్ హాఫ్ నచ్చలేదని ఆయన మీడియా ముందు చెప్పడంతో పూరి బాగా హర్ట్ అయ్యాడు. ఆ విషయం నాతో చెప్తే మార్చి రాసేవాణ్ణి కదా అంటూ పూరి ఫీల్ అవడం.. ఎప్పటికైనా చిరుతో సినిమా చేస్తానని ధీమాగా చెప్పుకుంటూ రావడం అనేది గతకొద్ది కాలంగా జరుగుతూ ఉంది. అదంతా గతం. ఇప్పుడు లేటెస్ట్ గా పూరి కల ను నిజం చేసేందుకు సిద్దమయ్యారు చిరు. పూరి లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ ను తన కుమారుడు చరణ్ తో కలిసి స్పెషల్ షో చూసి చాలా మెచ్చుకున్నారట పూరీ ని మెగా స్టార్. అంతే కాదు పూరీ కథ సిద్ధం చేసుకో మనం కలిసి మూవీ చేస్తున్నాం అంటూ ప్రామిస్ కూడా చేశారట.

చిరు భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న విడుదల కానుంది. తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో ఆయన సినిమాలు చెయ్యనున్నారు. ఈ లోగా పూరీ జగన్నాధ్ తన స్టయిల్లో చిరు కోసం కథ రెడీ చేసేసుకుంటే సరి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *