Type to search

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ “మళ్ళీ మళ్ళీ చూశా`కి గుమ్మ‌డికాయ కొట్టిన‌ చిత్ర‌యూనిట్‌

Actors Actresses Box Office News

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ “మళ్ళీ మళ్ళీ చూశా`కి గుమ్మ‌డికాయ కొట్టిన‌ చిత్ర‌యూనిట్‌

Malli Malli Chusa Motion Poster, Anurag Konidena, Krishi Creations, Shweta Avasti, Kairavi Thakkar, Sravan Bharadwaj, Saideva Raman, latest telugu movie, Motion Poster, New Telugu Movies, 2019 Movies, New Trailers, New Teasers, raatnam, Malli Malli Chusa trailer, Malli Malli Chusa teaser, Malli Malli Chusa shooting finished, Malli Malli Chusa post productionఅనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం “మళ్ళీ మళ్ళీ చూశా”.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో స‌హా అన్ని ప‌నులు పూర్తి అయిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్ గుమ్మ‌డి కాయ కొట్టారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

చిత్ర దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ.. “స్వేచ్ఛ లేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు.. సమరంలో సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమను గెలిచిన సైనికుడులాంటి ఓ సామాన్యుడి ప్రేమకథ “మళ్ళీ మళ్ళీ చూశా. నిర్మాత కె. కోటేశ్వరరావు పూర్తి స‌హ‌కారం అందించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు మంచి అసెట్ అవుతుంది. అలాగే న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా కోసం ప‌నిచేశారు. మంచి కంటెంట్ తో వ‌స్తోన్న సినిమా.. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఆగ‌స్ట్‌లో మీ ముందుకు రాబోతున్నాం. త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ చూడండి “అన్నారు.

నిర్మాత కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ…“ ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా చూసిన వారికి ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల స‌మాహార‌మే మా “మళ్ళీ మళ్ళీ చూశా. మా ద‌ర్శ‌కుడు హేమంత్ కార్తీక్ సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇటీవ‌ల మా సినిమాను కొంత మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చూసి.. మంచి సినిమా తీశారు. అని మా టీమ్‌ను అభినందించ‌డం జ‌రిగింది. దాంతో నాకు చిత్ర‌యూనిట్ కి సినిమా విజ‌యం ప‌ట్ల కాన్ఫిడెంట్ పెరిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ నెలలోనే మీ ముందుకు తీసుకువ‌స్తాం“ అన్నారు..

అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

రచన, దర్శకత్వం : హేమంత్ కార్తీక్,
నిర్మాత : కె. కోటేశ్వరరావు,
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్,
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల,
ఎడిటర్ : సత్య గిడుతూరి,
లిరిక్స్ : తిరుపతి జావాన,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :సాయి సతీష్ పాలకుర్తి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *