Type to search

సంపూ సినిమా ఎంత పలికిందో తెలుసా ?

Actors Actresses Box Office News

సంపూ సినిమా ఎంత పలికిందో తెలుసా ?

kobbari matta, kobbari matta trailer, kobbari matta teaser, kobbari matta songs, kobbari matta release date, sampoornesh babu, sampoornesh babu kobbari matta, kobbari matta rights, kobbari matta overseas rights, kobbari matta nizam rightsబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ. షకీలా, ఇషికా సింగ్, గాయత్రీ గుప్తా, గీతాంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు . ఇప్పుడు కొబ్బరి మట్ట టీమ్ ప్రమోషన్స్‌లో వేగం బాగా పెంచింది .

లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం మరియు ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. నో బారియర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దాదాపు రూ.1 కోటి చెల్లించి నైజాం, ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్నట్లు కొబ్బరి మట్ట టీమ్ తెలిపింది. సంపూ సినిమాకి ఇది ఒక మంచి ఫ్యాన్సీ రేట్ అనే చెప్పాలి. ప్రముఖ గీతాఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి ఈ సంస్థ కొబ్బరి మట్టను విడుదల చేస్తోంది .

పోస్టర్స్ చూస్తుంటే కన్నీళ్ళకే కన్నీళ్లొచ్చే … అన్నట్లు కనిపించినా కూడా కామెడీ పక్కా అని తెలుస్తోంది . దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి ఈసినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి మట్ట గ్రాండ్‌గా విడుదల కాబోతోంది . ఈ చిత్రానికి సంగీతం కామ్రాన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత : స్టీఫెన్ శంకర్. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *