Type to search

రానా సినిమా కు నో చెప్పిన హీరోయిన్ !

Box Office News

రానా సినిమా కు నో చెప్పిన హీరోయిన్ !

raatnam, Keerthi Suresh, Keerthi Suresh movies, Keerthi Suresh latest movies, Keerthi Suresh upcoming movies, Keerthi Suresh rana daggubati, Keerthi Suresh no to rana daggubati, Keerthi Suresh miss india, rana daggubati, rana daggubati movies, rana daggubati latest moviesమహానటి సినిమా తో బాగా పాపులర్ అయిన తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరైన రానా దగ్గుబాటి చిత్రం లో నటించడానికి నో చెప్పింది.అయితే రానా.. సినిమా కెరీర్ మళ్లీ స్టార్ట్ అవుతుందో ? అనే ప్రశ్నప్రశ్నగానే మిగిలిపోతోంది ? ఎప్పుడెప్పుడు
అనుకున్న ప్రాజెక్టులన్నీ దాదాపు డైలమాలో నే ఉన్నాయి .కొన్ని షూటింగ్‌లు ఆగిపోతే.. మరికొన్నిటికి నటీనటుల సమస్య వేధిస్తోంది. ఇక అనారోగ్య కారణాలతో రాణా అమెరికాకు వెళ్లి రెండేళ్లు దాటింది. కిడ్నీ ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్లు వార్తలు వచ్చాయి. చికాగోలో ఉన్నా.. అంతా ఒకే ఇంకొన్ని రోజుల్లో వస్తున్నా .. అని చెప్పిన రానా ఇప్పటికింకా ఇండియాకు రానేలేదు.

అమెరికాలో వుంటూ రాబోయే సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే ఓ హార్రర్ క్రైమ్ స్టోరీకి కమిటయ్యాడు. దాన్ని మిలింద్ రావ్ అనే తమిళ్ డైరెక్టర్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల సిద్దార్థ్ హీరోగా గృహం అనే సినిమా చేసి విజయం సాధించాడు ఆ డైరెక్టర్. కాని.. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. మిస్ ఇండియా మూవీతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తమిళంలో ఒక మూవీ, హిందీలో మరో రెండు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో.. రానా ఇండియాకి ఎప్పుడు వస్తాడో ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియకుండా ముందే డేట్స్ ఇవ్వలేనని కీర్తీ నో చెప్పిందని సమాచారం.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *