Type to search

ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్ కీలక ప్రకటన

News Politics Trenging News

ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్ కీలక ప్రకటన

💥💥💥💥💥Ts, telangana, ts cm, Raatnam, kcr, cm kcr, kcr meeting, ts high court, high court, kcr meeting about high court orders, Hyderabad, rtc, telangana rtc, kcr about rtc, kcr rtc, kcr ends rtc, kcr sensational statements about rtc

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా అని కేసీఆర్ తిట్టిపోశారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్‌ మండిపడ్డారు. యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్‌ ఆగ్రహించారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు.

నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.3 కోట్లు నష్టం వస్తోందని, ప్రైవేట్‌ బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. దిక్కుమాలిన నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీని ముంచుతామని, నువ్వు కాపాడుకో అన్నట్లుగా కార్మికుల ధోరణి ఉందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సుమారు రూ.50 వేల జీతం వస్తుందని, అవసరం అయినప్పుడు ఒక గంట ఎక్కువ పనిచేయలేరా అని నిలదీశారు. ‘మా కాళ్లు మేమే నరుక్కుంటాం’ అన్నట్లు వ్యవహరించవద్దని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హితవు పలికారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *