Type to search

నిజ జీవితం లో మరిది … సినిమాలో తమ్ముడు

Box Office News

నిజ జీవితం లో మరిది … సినిమాలో తమ్ముడు

telugu movies, donga teaser, donga telugu movie teaser, donga latest telugu movie teaser, donga movie teaser, donga karthi, latest telugu movies, 2019 telugu movies, donga karthi teaser, new telugu movies 2019, new telugu movie teasers 2019, latest telugu movie trailer, jyotika, jyotika telugu movies, telugu upcoming movie trailer 2019, Jeethu Joseph, donga official teaser, thambi tamil movie, karthi next movie, karthi jyothika movie, Raatnam, karthi donga teaser talk, karthi thambi, thambi, thambi teaserఖైదీ చిత్ర విజయం తో ముందుకు దూసుకుపోతున్న హీరో కార్తి. వదిన జ్యోతిక, మరిది కార్తీ తొలిసారి కలిసి నటించిన తమిళ చిత్రం ‘తంబి’. ఈ చిత్రానికి తెలుగు లో “దొంగ” అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇందులో జ్యోతిక కు తమ్ముడి పాత్రలో కార్తి కనిపిస్తారు.మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌(దృశ్యం ఫేమ్) ఈ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. సూరజ్‌ సదన్‌ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ‘దొంగ’ పేరుతో డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ‘దొంగ’ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను హీరో సూర్య రిలీజ్‌ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తి, జ్యోతిక ముఖాలు మాత్రమే ప్రముఖముగా కనిపిస్తున్నాయి. వారిద్దరికి మధ్యలో ఒక పోలీసు జీపు ఉంది. ‘‘ఏడాదిగా ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం తెరకెక్కిన విధానం చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు కార్తీ. ఈ సినిమా టీజర్‌ నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం లో అలనాటి నటుడు సత్యరాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సమర్పణలో ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *