Type to search

అందాల భామ మైనపు బొమ్మ

Box Office News Trenging News

అందాల భామ మైనపు బొమ్మ

Kajal Aggarwal, Kajal Aggarwal movies, Kajal Aggarwal latest movies, Kajal Aggarwal latest news, Kajal Aggarwal upcoming movies, Kajal Aggarwal wax statues, Kajal Aggarwal Madame Tassaud’s museum, kajal aggarwal in Madame Tassaud’s museum, Madame Tassaud’s museum kajal, kajal aggarwal wax statue in Madame Tassaud’s museumమేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తమ మైనపు విగ్రహాన్ని నెలకొల్పటం అన్నది ఓ అరుదైన గౌరవంగా భావిస్తారు సినీ తారలు. అది ప్రతి ఒక్కరి కల. ఇటువంటి గౌరవం ప్రపంచ ప్రఖ్యాత తారలకు మాత్రమే దక్కుతుంది. ఇటీవల టాలీవుడ్ హీరోలు ప్రభాస్‌, మహేష్ బాబు విగ్రహాలను కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ అందాల భామ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇందస్త్రి లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ లు ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఆమె మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇస్తారు మేడమ్ టుస్సాడ్స్‌ వారు. విషయాన్ని కాజల్‌ స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు తన వాక్స్‌ స్టాట్యూ ఇనాగరేషన్‌కు తాను స్వయంగా హాజరవుతున్నట్టుగా వెల్లడించింది కాజల్‌.
తన విగ్రహం టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయటం పట్ల కాజల్‌ ఉత్సాహంగా ఉంది. `2020 ఫిబ్రవరి 5న నా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సింగపూర్‌ వెళుతున్నాను. టుస్సాడ్స్‌లో నా వాక్స్‌ స్టాట్యూ ఏర్పాటు చేయటం గర్వంగా ఉంది. ఇది అల్టిమేట్‌ ఫిలిం స్టార్‌ ఎక్స్‌పీరియన్స్‌` అంటూ ట్వీట్ చేసింది కాజల్‌ అగర్వాల్‌.
చందమామ సినిమాతో ఆమె తెలుగులో మంచి పేరు సంపాదించుకొని సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఆమే కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రం లో నటిస్తోంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *