Type to search

ఏపీలో కొలువుల పండుగ..నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు..!

Andhra Latest News News Politics Top Stories

ఏపీలో కొలువుల పండుగ..నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు..!

ap, cm, jagan, jagan government, jagan government new schemes, jagan government latest news, jagan government new notifications, jagan government about jobs, jagan government about unemployment, jagan government recruitments, unemployment, new job notifications, mass job notifications, job notifications on mass scaleఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ఆర్‌సీపీ అధినేత సందింటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ల‌క్షా 20 వేల‌కు పైగా వివిధ కేట‌గిరీల‌లో ఖాళీగా వున్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు ఇటీవ‌ల‌. తాజాగా ఆ రాష్ట్ర స‌ర్కార్ ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేసేందుకు గాను నియామ‌ప‌క ప్ర‌క్రియ‌కు సంబంధించి నోటిఫికేష‌న్ల‌ను జారీ చేసింది. ఇక ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసిన ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, యువ‌తీ యువ‌కులు, వ‌య‌స్సు మ‌ళ్లిన వారికి జ‌గ‌న్ తీపి క‌బురు అందించారు. దీంతో ఆయా ప్రాంతాల‌లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంట‌ర్ల‌కు విప‌రీత‌మైన గిరాకీ ఏర్ప‌డింది. అయితే, ముందుగానే అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. క‌ష్ట‌ప‌డిన వారికే ఉద్యోగులు వస్తాయ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోను మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌ని, ఎవ్వ‌రికీ డ‌బ్బులు ఇవ్వ‌కండ‌ని కోరారు.

గ‌త హ‌యాంలో ఏర్పాటైన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం కేవ‌లం మాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైంద‌ని, కానీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌కారం తాము 4 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. ద‌శ‌ల వారీగా పోస్టుల‌ను భ‌ర్తీ చేసి తీరుతామ‌ని స‌భాముఖంగా స్ప‌ష్టం చేశారు. తాము ఏది చెబితే అది చేస్తామ‌ని, మాయ‌మాట‌లు చెప్పి మోసం త‌మకు రాద‌న్నారు..ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి. కాగా ఏపీ స‌ర్కార్ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లలో ఉద్యోగాలు ఇలా ఉన్నాయి. మొత్తం ల‌క్షా 28 వేల 589 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వార్డు, గ్రామ స‌చివాల‌య ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. వార్డు స‌చివాలయాల‌కు సంబంధించి సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో రాత ప‌రీక్ష చేప‌డ‌తారు. నాలుగో వారంలో నియామ‌క ప‌త్రాలు అంద‌జేస్తారు. ఇన్ స‌ర్వీస్ ఉద్యోగుల‌కు 10 శాతం మార్కులు వెయిటేజీ కింద క‌ల్పిస్తారు.

విభాగాల వారీగా చూస్తే, మొత్తం 13 విభాగాల‌లో ఖాళీగా ఉన్న వాటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. గ్రామ స‌చివాల‌యంలో 13 కేట‌గిరీల‌కు సంబంధించి 95 వేల 88 పోస్టులు, వార్డు స‌చివాల‌యాల్లో 9 విభాగాల‌కు సంబంధించి 35 వేల 501 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. రాష్ట్రంలో కొత్త‌గా 11 వేల 114 గ్రామ కార్యాల‌యాలు, 3 వేల 786 వార్డు స‌చివాల‌యాలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ కార్యాల‌యంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి, గ్రామ రెవిన్యూ అధికారి, ఏఎన్ఎం, ప‌శుసంవ‌ర్ద‌క‌, మ‌త్స్య‌, ఉద్యాన‌, వ్య‌వ‌సాయ‌, ప‌ట్టు ప‌రిశ్ర‌మ స‌హాయకుల పోస్టుల‌ను స్థానిక అవ‌స‌రాల మేర‌కు భ‌ర్తీ చేస్తారు. మ‌హిళా, పోలీసు, ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుడు, డిజిట‌ల్ అసిస్టెంట్, గ్రామ స‌ర్వేయ‌ర్, సంక్షేమ విద్యా స‌హాయ‌కుడు పోస్టులు కూడా భ‌ర్తీ కానున్నాయి. జిల్లా ఎంపిక క‌మిటీల ద్వారా ఈ నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు. ఒప్పంద‌, పొరుగు సేవ‌ల కింద ఇప్ప‌టికే ప‌నిచేస్తూ అదే పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి ఈ ఛాన్స్ ద‌క్క‌నుంది.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *