Type to search

ఇండియాను షేక్ చేస్తున్న జియో – ఎయిర్ టెల్, వోడా డీలా..!

News Top Stories

ఇండియాను షేక్ చేస్తున్న జియో – ఎయిర్ టెల్, వోడా డీలా..!

Jio, Jio Fiber Offers, Jio Fiber Plans, Jio Fiber Plans Price, Jio Fiber Price, Jio Giga Fiber, Jio Giga Fiber Offers, Jio Giga Fiber Plans, Jio Giga Fiber Price, mukesh ambani, Reliance Jio, Reliance Jio Giga Fiber, Reliance JioFiber, Reliance JioFiber Connection, Reliance JioFiber Plans, Reliance JioFiber Subscription, airtel, vodafone, voda, jio crazeముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ స్టార్ట్ చేసిన జియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయిల్, జ్యుయెలరీ, ఈ కామర్స్ , ఫ్యాషన్, లాజిస్టిక్ రంగాలలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఈ కంపనీ ఇటీవలే టెలికం రంగాన్ని ఒంటి చేత్తో శాసించే స్థాయికి చేరుకుంది. ప్రత్యర్హి కంపెనీలు భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ , ఎయిర్ టెల్ , వోడా ఫోన్ , ఐడియా, టాటా టెలికాం ఇలా ప్రతి టెలికాం ఆపరేట్స్ కు చుక్కలు చూపిస్తోంది. మొదటి సారిగా జియో ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లైట్ గా తీసుకున్నాయి మిగతా కంపెనీలు. కానీ ఆర్ ఐ ఎల్ మాత్రం దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఎంతలా అంటే ప్రపంచాన్ని గూగుల్ ఎలా తన కంట్రోల్ లో పెట్టుకున్నదో, అలాగే రిలయన్స్ కంపెనీ మారుమూల గ్రామాలకు సైతం తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది.

ఇందు కోసం వేలాది కోట్లను ఖర్చు చేసింది. దీంతో డేటా కన్వర్జేషన్ అన్నది మరింత సులభతరంగా తయారైంది. ఇండియాలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని ఇటీవల ముంబైలో జరిగిన మీటింగ్ లో చెప్పారు ముకేశ్ అంబానీ. ఇది తమ ఆలోచన కాదని. తమకు ప్రాణం పోసి, ప్రపంచంలోనే నమ్మకమైన, ఎన్నదగిన బ్రాండ్ గా రూపొందేలా చేసిన తమ తండ్రి ధీరుభాయి అంబానీదేనని చెప్పారు. ఆయన అడుగుజాడల్లోనే తాము నడుస్తున్నామని, ఆయన ముందు చూపు వల్లనే ఇవ్వాళ వరల్డ్ లోనే మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్ గా తమ కంపెనీ నిలిచిందన్నారు. ప్రత్యర్థి కంపెనీలు తమ దరిదాపుల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కాగా జియో సబ్‌స్క్రైబర్లు అదనంగా 85 .39 లక్షలు చేరడం తో ఇప్పుడు ఇండియాలోనే 35 కోట్లకు పైగా రిలయన్స్ జియోను ఎంచుకున్నారన్నమాట. రోజు రోజుకు జియో నూతన సబ్‌స్క్రైబర్లను జత చేసుకుంటూ జర్నీని కొనసాగించడంలో వాయు వేగంతో దూసుకెళ్తోంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం..జూలైలో భారీగా సబ్‌స్క్రైబర్లను జత చేసుకుంది.

ఇటీవలే కస్టమర్ల పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కు నెట్టి రెండవ స్థానానికి చేరిన ఈ సంస్థ. అనతి కాలంలోనే ఏకంగా 33.97 కోట్ల సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. జూలై చివరి నాటికి 0.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. మరోవైపు సునీల్‌ మిట్టల్‌ నేతృత్వంలోని భారతి ఎయిర్‌టెల్‌ 25.8 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఈ సంస్థ బేస్‌ 32.85 కోట్లకు తగ్గి పోయింది. వొడాఫోన్‌ ఐడియా జూలైలో 33.9 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. జూలై చివరి నాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 38 కోట్లకు తగ్గినట్లు తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.88 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లను జత చేసుకోవడంతో ఈ సంస్థ చందాదారుల సంఖ్య 11.6 కోట్లకు పెరిగింది. మరో వైపు తన బిజినెస్ ను మరింత విస్తరించడంతో భాగంగా ‘రిలయన్స్‌ జియో’ 5జీ సేవలపై దృష్టి సారించింది. ఈ సేవలను అందించడంలో భాగంగా చైనా టెలికం సంస్థలతో జత కట్టింది. ఓపెన్‌ టెస్ట్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థలతో భేటీ అయినట్లు రిలయన్స్ ప్రకటించింది. 5జీ వెల్లడించింది. చైనా మొబైల్, చైనా యునికామ్, ఇంటెల్, రాడిసిస్, శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌స్పాన్, లెనొవొ, రూజీ నెట్‌వర్క్, విండ్‌రివర్‌ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది. మొత్తం మీద రాబోయే రోజుల్లో రిలయన్స్ ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *