Type to search

రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: జీవిత

Box Office News

రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: జీవిత

Raatnam brings you the news that actress Jeevitha Rajasekhar says in movie artists association that Rajasekhar has a mentality like a child.మా’ డైరీ ఆవిష్కరణ‌లో రాజశేఖర్ లేవనెత్తిన వివాదం పై వివాదంపై జీవితా రాజశేఖర్‌ స్పందించారు. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పిన ఆమె.. ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం వల్లనే ఇలా జరిగిందని తెలిపారు. ‘మా’ అభివృద్ధికి చిరంజీవి ఎన్నో సలహాలు ఇచ్చారని.. గొడవలు సద్దుమణిగేందుకు చాలా సమయం ఇచ్చారని.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నామని ఆమె వెల్లడించారు. ఎక్కడైనా గొడవలు రావడం సహజమని ఆమె అన్నారు. తాము కూడా మనుషులమని, దేవుళ్లం కాదని జీవిత ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు మంచి చేసినా అది అందరికీ వర్తిస్తుందని ఆమె తెలిపారు . అందరం కలిసే పనిచేసి.. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటామని జీవిత ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా మా డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆయన మాట్లాడే సమయంలో రాజశేఖర్ పలుమార్లు కల్పించుకున్నారు. ఒకానొక సమయంలో చిరు నుంచే కాకుండా వేరే వారి దగ్గరి నుంచి కూడా మైక్ లాక్కొన్ని ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. మరి ఈ సంఘటన ను మరీ ఎక్కువగా మీడియా లో ప్రచారం చేయొద్దని మీడియా పర్సన్స్ కు రిక్వెస్ట్ చేశారు చిరంజీవి

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *