Type to search

సూపర్‌ అమ్మ… ఐ లవ్‌ యూ అంటున్న హీరోయిన్

Actors Actresses Box Office Gallery News

సూపర్‌ అమ్మ… ఐ లవ్‌ యూ అంటున్న హీరోయిన్

హీరోయిన్ ఇలియానా తన తల్లి సమీరాకు స్పెషల్ గా బర్త్ డే గ్రీటిగ్స్ చెప్పారు. అమ్మపై తనకున్న ప్రేమను చెపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు . తన బాల్యం లో దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. ‘నువ్వే నా బలం, బలహీనత, నువ్వే నా సర్వస్వం. నీపై ప్రేమను చెప్పేందుకు మాటలు సరిపోవు. నువ్వు నా కోసం చేసిన, చేస్తున్న ఎన్నో పనులకు కృతజ్ఞతలు చెపితే చాలదు . సూపర్‌ఉమన్‌, సూపర్‌ అమ్మ. ఐ లవ్‌ యూ’ అని చాలా ఎమోషనల్ గా చెప్పారు . ఈ పోస్ట్‌ను కేవలం రెండు గంటల్లో 1.3 లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. ఇలియానా చిన్నతనంలో దిగిన ఫొటోలను షేర్‌ చేయడం ఇది తొలిసారి కాదు. ఆమె ఇప్పటికే పలుమార్లు అభిమానులతో తన బాల్యం ఫొటోలు పంచుకున్నారు.
ఇక ఇటీవలే తన లవర్ ఆండ్రూ నీబోన్‌తో బ్రేక్ అప్ అయిన విషయాన్ని కూడా ఇలియానా పోస్టులు చూసే నెటిజన్లు తెలుసుకున్నారు. ఎలా అంటే తన ఇంస్త్రగ్రామ్ నుండి తన ఫోటోలను తొలగించింది ఇల్లీ బేబీ. తల్లి ప్రేమ సరే మరి ప్రియుడి తో ప్రేమ ఏమైంది అంటూ అనుకుంటున్నారు ఆమె అభిమానులు .

Tags:

You Might also Like

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *