Type to search

మళ్ళీ మెరిసిన మన హైదరాబాద్

News Top Stories

మళ్ళీ మెరిసిన మన హైదరాబాద్

telangana, cm, kcr, ts, ts cm, ts cm kcr, hyderabad, bhagyanagaram, best universities, university grants commission, hyderabad central university, hcu tops universities, hcu best universityఏ ముహూర్తంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో కానీ, అన్ని రంగాలలో ఈ కొత్త రాష్ట్రం దూసుకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. ఈ దేశంలో పూర్తి అవగాహన, పరిపాలనా పరమైన అనుభవం కలిగి ఉండటమే కాదు, భవిష్యత్తు పట్ల దార్శనికత కలిగిన ముఖ్యమంత్రులల్లో నవీన్ పట్నాయక్ తో పాటు మన రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఒకరు. అధికారులను పరుగులు పెట్టిస్తూ, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ దూసుకెళుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేలా కృషి చేస్తున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన పురష్కారాలలో ఈ రాష్ట్రానికి పలు అవార్డులు వరించాయి. తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించిన బెస్ట్ యూనివర్సిటీస్ లలో హైదరాబాద్ లోని హైదరాబద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం అత్యంత విశిష్ట హోదా దక్కించుకుంది. చరిత్ర సృష్టించింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోధనలోను, నాణ్యమైన విద్యను అందించడంలోనూ అందరికంటే ముందు ఉంటోంది. దీనిని 1974 లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి అప్పారావు ఉప కులపతిగా ఉన్నారు. హైదరాబాద్ , ముంబై రహదారికి దగ్గరలో ఉన్నది. 2000 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. హైదరాబాద్ నగరంలో అతి సుందరమైన క్యాంపస్ లలో ఇది కూడా ఒకటి. దీనికి అనుబంధంగా అబిడ్స్ లో గోల్డెన్ త్రెష్ హోల్డ్ పేరుతో అనుబంధ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఈ విశ్వ విద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. ఉన్నత విద్యకు పెట్టింది పేరు. ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి గా పని చేశారు. 2012 సంవత్సరంలో భారతదేశంలో ఈ యూనివర్సిటీ ఏడవ ర్యాంక్ సాధించింది. ఇక అత్యుత్తమమైన రాష్ట్రపతి అవార్డు ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అందుకుంది.

మొదటి సారిగా సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు శాఖను ప్రారంభించారు. 1978లో పీహెచ్ డి ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎంఎ, 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు మొదటి ఆచార్యులుగా పనిచేశారు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 13 మంది అధ్యాపకులతో శాఖ విస్తరించింది. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని 2010 లో స్థాపించారు. బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్త గా పని చేశారు. 2015 వరకు 150 లక్షల నిధులు యుజిసి కేటాయించింది. యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ , రతన్ టాటా సంయుక్త ఆధ్వర్యంలో “థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో అతి పెద్దలైబ్రరీ ఉన్నది. మొత్తం మీద పలు కోర్సులతో పాటు వసతి సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు వెళుతున్న ఈ యూనివర్సిటీ మరింతగా ఎదగాలని కోరుకుందాం.

Tags:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *